ఆర్మూర్, అక్టోబర్ 4: ఆర్మూర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధుల గుట్టను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆయన సిద్ధుల గుట్టను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని కోరాగా.. పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం ప్రణాళికలు తయారుచేయిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దీంతో వారికి జీవన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేసిన తరహాలో ముస్లిములు, క్రైస్తవులకు ప్రత్యేకంగా శ్మశానవాటిక స్థలాలను అభివృద్ధిచేయాలని జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ బిల్లులను చెల్లించి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.