భూత్పూర్, జనవరి 19 : గ్రామీణ యు వత క్రీడల్లో ప్రావీణ్యం పెంచుకొని జాతీ య, అంతర్జాతీయస్థాయి పోటీల్ల్లో రాణించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్‌లో బుధవారం మూసాపేట మండలం చక్రాపూర్, కనకాపూర్‌తండా, భూత్పూర్ మున్సిపాలిటీకి చెందిన యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం, స్నేహభావం పెంపొందుతాయన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉం టుందని తెలిపారు. క్రీడాకారులకు తనవం తు ప్రోత్సాహం అందిస్తానని ఎమ్మెల్యే ఆల చెప్పారు. గ్రామీణ యువత క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల ఉపాధ్యక్షుడు గడ్డం ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.