డీఈవోలు రవీందర్, లియాఖత్ అలీకి ఘన సన్మానం
నారాయణపేట రూరల్, ఆగస్టు 18 : విద్యాభివృద్ధికి డీఈవో రవీందర్ ఎనలేని కృషి చేసి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారని ధన్వా డ జీహెచ్ఎం శెట్టి రమేశ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఆదర్శ డిగ్రీ కళాశాలలో వనపర్తి జిల్లాకు బదిలీపై వెళ్లిన డీఈవో రవీందర్, జిల్లా నూతన డీ ఈవోగా విధుల్లో చేరిన లియాఖత్ అలీకి ఆత్మీయ వీడ్కోలు, ఆహ్వాన సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని ఆయా మండలాల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఎస్వోలు, ప్ర భుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అం దజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జి ల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ గడిచిన రెండేం డ్లలో గుణాత్మకమైన విద్యనందించేందుకు తీవ్రమైన కృషి చే శారని కొనియాడారు. జిల్లాలో సైన్స్ ఫెయిర్ నిర్వహణ, సీడ్ బాల్స్ తయారీ, ఎస్సెస్సీ ప్రేర ణ తరగతులు, ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటు, హరివిల్లు, బడి హామీ డిక్షనరీల పంపిణీ, 120 స్మార్ట్ టీవీల వి తరణ, జూమ్ యాప్‌ల ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాలతో రాష్ట్రస్థాయి గు ర్తింపు తెచ్చిన ఘనత దక్కిందన్నారు. కార్యక్రమానికి జీహెచ్ఎం అనంతప్ప అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంఈవో గోపాల్‌నాయక్, జీహెచ్ఎంలు రాజేశ్వర్‌రావు, ఆంజనేయులు, వేణుగోపాల్, వెంకట్రాముడు ఉన్నారు.