నారాయణపేట రూరల్, ఆగస్టు 14 : హసన్, హుసేన్ల వీరోచిత పోరాటం ప్రాణ త్యాగానికి జ్ఞాపకార్తంగా చేసుకునేదే మొహర్రం పండుగ, వారి త్యా గాలను గుర్తు చేసుకుంటూ పీర్లను ఉరేగిస్తారు. మండలంలోని జాజాపూర్, కోటకొండ, కొల్లంపల్లితోపాటు తదితర గ్రామాల్లోని మసీదుల్లో శనివారం పీర్లు కొలువుదీరాయి. మొహర్రం సందర్భంగా మసీదుల వద్ద అలయ్ గుంతలను తవ్వారు. దీంతో చిన్నారులు ఆటలు ఆడుతూ సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు. పలు చోట్లా గుండం తొక్కుతారు. ఈ పండుగను కులమతాలకతీతంగా గ్రామాల్లో నిర్వహిస్తారు. మండలంలోని జాజాపూర్లో సోమవారం రాత్రి అ బ్బాసలి మసీదు, మంగళవారం ఖాశీంసాబ్ మసీదు, గురువారం మౌలాలి మసీదు, బజార్ మసీదుల్లో సవారీలు జరుగుతాయి. ఆయా మసీదుల వద్ద చాలా మంది భక్తులు కందూర్లు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. శుక్రవారం అన్ని మసీదుల పీర్లను పురువీధుల గుండా ఊరేగింపు నిర్వహించి చెరువులో ని మరజ్జనానికి తరలిస్తారు.
బాలానగర్, ఆగస్టు 14 : మండలకేంద్రంతోపా టు పలు గ్రామాల్లో మొహ్రరం వేడుకలు ప్రారంభమయ్యాయి. మండలంలోని పీర్ల చావిడిలను విద్యు త్ దీపాలతో అలంకరించి, పీర్లను ప్రతిష్ఠించారు. పది రోజులతోపాటు హిందూ, ముస్లింలు సంప్రదాయబద్ధంగా పీర్ల పండుగను ఘనంగా జరుపుకొంటారు.
భూత్పూర్, ఆగస్టు 14 : మొహ్రరం మాసం సం దర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మసీదుల్లో పీర్లను ప్రతిష్ఠించారు. మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మసీదుల వద్ద పిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో ఆటపాటలు, కోలాటాలతో వేడుకల ను నిర్వహిస్తున్నారు. పీర్లచావిడిల వద్ద ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మొహర్రం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సందర్భంగా ప్రత్యేక ప్రా ర్థనలు నిర్వహించారు.