దామరగిద్ద, ఆగస్టు 13 : మండలంలోని వివి ధ గ్రామాల్లో శుక్రవారం నాగుల పంచమిని భక్తు లు ఘనంగా నిర్వహించారు. క్యాతన్‌పల్లి వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో నాగుల పంచమి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమం లో భక్తులు, పూజారులు పాల్గొన్నారు.
మక్తల్ రూరల్, ఆగస్టు 13 : మండలంలో నా గుల పంచమిని పురస్కరించుకొని ఆయా ఆలయాల్లో నాగదేవతలను దర్శించుకొని, పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అలాగే పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి, మల్లికార్జునస్వామి, కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో భక్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగదేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసి దర్శించుకొని నైవేద్యం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు.
ఊట్కూర్, ఆగస్టు 13 : నాగుల పంచమి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో భక్తులు ఘనంగా జరుపుకొన్నారు. నాగదేవతలను దర్శించుకొని పుట్టలో పాలు పోశారు. భక్తులు నాగదేవతలకు పిండి వంటల నైవేద్యం సమర్పించి మొక్కబడులు చెల్లించుకున్నారు. వేడుకల సందర్భ ంగా అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సందడితో ఆలయాలు కిటకిటలాడాయి.
కృష్ణ, ఆగస్టు 13 : మండలంతోపాటు మరహరిదొడ్డి, గుడెబల్లూర్, ముడుమాల హిందుపూర్, కున్సి తదితర గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా గ్రామా ల్లో నాగదేవతల విగ్రహాలు, పుట్టల వద్ద భక్తులు బెల్లం, పాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధ రించి, భౌతిక దూరం పాటిస్తూ భక్తులు నాగుల పంచమి వేడుకల్లో పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, ఆగస్టు 13 : మండలంలోని జాజాపూర్, సింగారం, భైరంకొండ, అ ప్పక్పల్లి, కొల్లంపల్లి, అంత్వార్, ఊటకుంటతం డా, పిల్లిగుండ్లతండాతోపా టు తదితర గ్రామాల్లో నాగుల పంచమిని ఘనంగా నిర్వహించారు. భక్తు లు నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమ తులు ప్రదానం చేశారు.
మరికల్, ఆగస్టు 13 : నాగుల పంచమిని మం డలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక పాత కుర్వగేరిలోని మల్లి కార్జునస్వామి ఆలయం, పోచమ్మ గుడి వద్ద నాగులకు భక్తులు, నూతన దంపతులు నాగులకు పా లు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగదేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసి దర్శించుకొని నైవేద్యం సమర్పించి మొ క్కులు చెల్లించు కున్నారు. అలయాల్లో ప్రత్యేక పూ జలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పల్లెగడ్డ గ్రామంలో మట్టితో నాగులను త యారు చేసినా నూతన దంపతులు, గ్రామస్తులు పాలు పోశారు.
కోస్గి, ఆగస్టు 13 : నాగుల పంచమి వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున నాగులకు పూజలు నిర్వహించారు. పట్టణంలోని నాగులబావి వద్ద నాగులకు మహిళలు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
ధన్వాడ, ఆగస్టు 13 : మండలంతోపాటుగా వివిధ గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు నాగులకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగులకు ప్రత్యేక పూజలు చేశారు.
నారాయణపేట టౌన్, ఆగస్టు 13 : పట్టణ ప్ర జలు నాగుల పంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మహిళలు ఉపవాసాలు చేసి నాగుల విగ్రహాలకు, పుట్టలో పాలు పోసి, తీపి వంటకాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. పలు ఆలయాల్లో ఉదయం నుంచే నాగుల వి గ్రహాల వద్ద మహిళలు, చిన్నారులు బారులు దీరి కనిపించారు.