ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
ఉద్యమ పార్టీలోకి..
నారాయణపేట, ఆగస్టు 13 : నియోజకవర్గంలోని మరికల్, తీలేర్ గ్రామాలకు చెందిన బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 30 మంది శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. పేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్.రా జేందర్‌రెడ్డి పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో యువత పాలు పంచుకోవాలన్నారు. పార్టీలో చేరిన వారిలో మరికల్‌కు చెందిన రాజేశ్, రవి ప్రకాశ్, నరేశ్, తిరుపతి, మహే శ్, తీలేర్ గ్రామానికి చెందిన మల్లేశ్, భీం రాజ్, నర్సింహులు, యాదయ్య, రాములుతోపాటు మరో 20 మంది ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చంద్రకాంత్, యువజన నాయకులు శ్రీపాద్, చెన్నారెడ్డి, సుభాష్, మోహన్‌నాయక్, సుజాత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ సర్పంచ్..
తాడూరు, ఆగస్టు 13 : కాంగ్రెస్ పార్టీకి చెందిన మండలంలోని భలాన్‌పల్లి సర్పంచ్ అశోక్‌కుమార్ శుక్రవారం పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భలాన్‌పల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. సర్పంచ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరానన్నారు. అలాగే ఉపసర్పంచ్‌తోపాటు పది మంది వార్డు మెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు రమేశ్, రాజుగౌడ్, అనిల్‌రెడ్డి, మశన్న, కృష్ణయ్య, శేఖర్‌గౌడ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి 20 మంది..
కొల్లాపూర్, ఆగస్టు 13 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దకొత్తపల్లి మండలం కొత్త యాపట్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది ఎమ్మెల్యే బీరం సమక్షంలో కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ బలోపేతానికి అం దరూ కృషి చేయాలన్నా రు. టీఆర్ఎస్లో చే రిన వారిలో వెం కటేశ్గౌడ్, రా ములు, బా లస్వా మి, వెంకటస్వామి, తిరుపతయ్య, సత్యనారాయణ, సైదులు, వార్డుసభ్యుడు దేవేంద్రం, మరో 12 మంది ఉన్నారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్యయాదవ్, మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు.