కలెక్టర్ హరిచందన
పేట జిల్లా దవాఖానకు స్పాట్కేర్ మెడికల్ పరికరం వితరణ
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 2 : కియోస్క్ లేదా స్పా ట్కేర్ పరికరంతో రోగులు మెరుగైన వైద్యం పొందవచ్చని కలెక్టర్ హరిచందన అన్నారు. పునర్జన్మ స్వచ్ఛంద సంస్థ గు రువారం పేటలోని జిల్లా దవాఖానకు స్పాట్కేర్ మెడికల్ ప రికరాన్ని వితరణ చేశారు. ఈ పరికరాన్ని ప్రారంభించిన అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ మౌలిక పరంగా వెనుకబడిన జిల్లాలో పేద రోగులకు టెలీ మెడిసిన్ ద్వారా నిపుణులను అనుసంధానం చేయడానికి ఈ పరికరం ఉపయోగపడుతు న్నదన్నారు. అనంతరం పునర్జన్మ సంస్థ ప్రతినిధులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రతినిధి రఘురాజగోపాల్ మాట్లాడుతూ కియోస్క్ పరికరాన్ని బెంగళూర్‌లోని నే చురల్ మైండ్స్ సిస్టమ్స్ ద్వారా తయారు చేసినట్లు చెప్పారు. కియోస్క్ పరికరం బహువిధాలుగా పని చేస్తుందని, మనిషి ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ పల్స్రే ట్, రక్తపోటు, ఈసీజీ, రక్తంలో గ్లూకోజ్ శాతం వంటి పరీక్షల ను సమర్థవంతంగా నిర్వహిస్తు ందన్నారు.
దవాఖానను సందర్శించే రోగుల కోసం మెట్రో నగరా ల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లను అ నుసంధానం చేసి వారి సలహాలతో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ పరికరం సహయపడుతుందన్నారు. నేచురల్ మైండ్స్ వ్యవస్థాపకులు మధుబాల రాజగోపాల్ మాట్లాడు తూ ప్రతి పౌరుడికి ఆరోగ్య సంరక్షణ అందించడమే కంపెనీ లక్ష్యం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా.మల్లికార్జున్, డా.రంజిత్ తదితరలు పాల్గొన్నారు.