దేవరకొండ, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్న దృష్ట్యా.. పోటీ పరీక్షలకు హాజరయ్యే దేవరకొండ నియోజకవర్గ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుండి నియోజకవర్గ యువతీ యువకులు ఉద్యోగాలు సాధించేలా ఉత్తమ శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ కూడా అందించనున్నట్లు చెప్పారు.
నిరుద్యోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చుచేయడంతో పాటు వసతి లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నియోజకవర్గ కేంద్రంలోనే వారికి ఉచిత శిక్షణ అందించాలనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. ఉచిత శిక్షణకు హాజరయ్యే వారు ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని, 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కోచింగ్ తీసుకునే వారికి మధ్యాహ్న భోజనం కూడా అందిస్తామన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్-2, 3, 4 ఉద్యోగాలకోసం అనుభవం కలిగిన అధ్యాపకుల ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆధార్ కార్డు, టెన్త్, ఇంటర్, డిగ్రీ మెమో జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు అందించాలని సూచించారు. వివరాలకు సెల్. 9440426803, 9177131309కు సంప్రదించాలన్నారు.
సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, నాయకులు హన్మంతు వెంకటేశ్‌గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్‌చైర్మన్ రహత్‌అలీ, నాయకులు వడ్త్య దేవేందర్, వేముల రాజు, పొన్నెబోయిన సైదులు, మహ్మద్ రయీస్, మూడావత్ జయప్రకాశ్‌నారాయణ, చిత్రం ప్రదీప్, బొడ్డుపల్లి కృష్ణ, రేపాని ఇద్దయ్య, పాత్లావత్ లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.