మోటకొండూర్, ఏప్రిల్ 25 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దిలావర్పూర్, ఇక్కుర్తి, కదిరేణిగూడెం, చామాపూర్, కాటేపల్లి గ్రామాల్లో ఐకేపీ, అమ్మనబోలు, మాటూరు, చందేపల్లిలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, నాంచారిపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాటేపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఎంపీడీఓ వీరస్వామి, ఏపీఎం సత్యనారాయణ, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ కృష్ణంరాజు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాజు, సర్పంచులు అమరేందర్‌రెడ్డి, మాధవి, స్వప్న, మున్నీ, పాండు, నర్మద, వినోద, ఎంపీటీసీ జ్యోతిలక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, అనంతరెడ్డి, పీఏసీఎస్ సీఈఓ భద్రారెడ్డి, సీసీ మల్లేశ్, ఏఈఓ రమేశ్ పాల్గొన్నారు.
గుండాల : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ తాండ్ర అమరావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో అంబాల, సీతారాంపురం, వెల్మజాల, కొమ్మాయిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తాసీల్దార్ శ్రీనివాస్ రాజ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్ బాషిరెడ్డి, ఎంపీటీసీ మహేశ్, రైతుబంధు సమితి కన్వీనర్ పాండరి, మార్కెట్ డైరెక్టర్ మల్లయ్య, ఉపసర్పంచ్ యాదయ్య పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : రైతులను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్‌గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని పటేల్‌గూడెం, శారాజీపేట, గొలనుకొండ, టంగుటూరు, కొల్లూరు గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. జడ్పీటీసీ నగేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చంద్రకళ, డైరెక్టర్లు మల్లేశ్‌గౌడ్, నర్సింహులు, భిక్షపతి, శేఖర్‌రెడ్డి, సుందరయ్య, సర్పంచులు పద్మ, జయమ్మ, సమరసింహారెడ్డి, పద్మ, నవ్య, లక్ష్మి, ఎంపీటీసీలు అనూరాధ, ప్రశాంత్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని చుక్కాపురం, పుల్లాయిగూడెం, కూరెళ్ల, పల్లెర్ల, తిమ్మాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ జహంగీర్, ఆర్ఐ యాదగిరి, సర్పంచులు ఉప్పలయ్య, నరసింహారెడ్డి, గిరిజ, రాంరెడ్డి, రాజు, ఎంపీటీసీ మల్లారెడ్డి, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ యశ్వంత్‌కుమార్, సహకార సంఘం డైరెక్టర్లు నిర్మల, నరసింహ, శ్రీరాములు పాల్గొన్నారు.
రామన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలిచిందని మార్కెట్ కమిటీ చైర్మన్ కునపురి కవిత, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, సింగిల్‌విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంతోపాటు నీర్నెముల, కుంకుడుపాముల, బాచుప్పల, బోగారం, కొత్తగూడెం, ఇంద్రపాలనగరం, ఉత్తటూరు, నిదానపల్లి, సర్నేనిగూడెం, కొమ్మాయిగూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాటి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఉపేందర్, తాసీల్దార్ ఆంజనేయులు, సర్పంచులు నర్సింహారెడ్డి, సిద్ధమ్మ, యాదిరెడ్డి, పద్మ, స్వామి, కృష్ణవేణి, రాణి, సుజాత, ఎంపీటీసీలు మహేందర్‌రెడ్డి, పద్మ, పుష్ప నర్సింహ, శ్రీధర్‌రెడ్డి, రమేశ్, విక్రం పాల్గొన్నారు.
చౌటుప్పల్/భువనగిరి అర్బన్ : స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భువనగిరిలోని మార్కెట్ కార్యాలయ ఆవరణలో మే 2న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు.
భువనగిరి అర్బన్ : మండలంలోని చందుపట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో గౌస్‌నగర్, వీరవెల్లి, బండసోమారం, ఎర్రంబెల్లి, చందుపట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ మందడి లక్ష్మీనర్సింహారెడ్డి సోమవారం ప్రారంభించారు. వైస్ చైర్మన్ ఎలిమినేటి మల్లారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్లు సౌజన్య, మహేందర్, స్వామి, బాలమ్మ, వెంకటేశ్వర్లు, శంకరయ్య, వెంకట్‌రెడ్డి, లక్ష్మి, మల్లారెడ్డి, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.