భువనగిరి అర్బన్, ఏప్రిల్ 24 : జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష సజావుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 83.6శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ కానుగుల నర్సింహ తెలిపారు. ఆరో తరగతికి ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
6వ తరగతి పరీక్షకు 974 మంది హాజరు కావాల్సి ఉండగా 837 మంది హాజరయ్యారు. 137 మంది గైర్హాజరయ్యారు. 7వ తరగతికి 315 మందికిగాను 254 మంది విద్యార్థులు హాజరు కాగా.. 61 మంది గైర్హాజరయ్యారు. 8వ తరగతికి 265 మందికిగాను 213 మంది హాజరయ్యారు. 52 మంది విద్యార్థులు హాజరు కాలేదు. 9వ తరగతికి 138 మందికిగాను 117 మంది హాజరయ్యారు. 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 10వ తరగతి ప్రవేశ పరీక్షకు 50 మందికిగాను 37 మంది హాజరు కాగా.. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అన్ని తరగతులకు కలిపి మొత్తం 1,742 మంది విద్యార్థులకుగాను 1,458 మంది హాజరయ్యారు. 284 మంది గైర్హాజరయ్యారు
గుండాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 6,7,8,9,10 తరగతుల్లో పరీక్ష 6వ తరగతికి 102 మంది దరఖాస్తు చేసుకోగా.. 93 మంది పరీక్షకు హాజరయ్యారు. 7వ తరగతికి 13 మంది దరఖాస్తు చేసుకోగా.. 10 మంది, 8వ తరగతికి 10 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది విద్యార్థులు, 9వ తరగతికి ఏడుగురు దరఖాస్తు చేసుకోగా.. ఆరుగురు, 10వ తరగతికి 10 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు.