సూర్యాపేట సిటీ, ఏప్రిల్ 22 : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వైజాగ్‌కు చెందిన సీదారి ప్రభుదాస్ సూర్యాపేట పట్టణానికి చెందిన కొల్లు సాయికిరణ్, కోలా మణికంఠతో కలిసి గంజాయి విక్రయిస్తున్నారు.
సూర్యాపేట కొత్త బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం డీఎస్పీ మోహన్‌కుమార్ పర్యవేక్షణలో పెట్రోలింగ్ నిర్వహించగా ఆ సమయంలో బస్తాతో బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకుని తనిఖీ చేయగా 15 కిలోల గంజాయి లభించింది. రెండు పల్సర్ బైక్‌లు, మూడు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ ఆంజనేయులు, ఎస్ఐ పి.శ్రీనివాస్, సీసీఎస్ సీఐ రవికుమార్, ఎస్ఐ నరేశ్, సీసీఎస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమో దు చేశారు. ఏఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో శుక్రవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నాగార్జున ట్రాన్స్‌పోర్టు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న దద్దనాల చెరువుకు చెందిన ప్రభుజీ, గుంటూరు జిల్లా దొడ్లలేరుకు చెందిన పుల్లారావును పట్టుకుని విచారించగా వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి లభించింది. రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.