నార్కట్‌పల్లి,ఏప్రిల్ 18 : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నర్సింహ (75) అనారోగ్యంతో సోమవారం మధ్యా హ్నాం మృతిచెందారు. ఇటీవల హైదరాబాద్‌లో చికిత్స పొంది వారం క్రితం డిశ్చార్జి అయి నార్కట్‌పల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఉండగా సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న చిరుమర్తి వెంటనే చేరుకొని తండ్రి పార్థివదేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. నర్సింహ భార్య మారమ్మ, కూతురు ఎల్లమ్మ రోదనలు అంద రినీ కంటతడి పెట్టించాయి. బ్రాహ్మణ వెల్లెంలలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిరుమర్తి నర్సింహ అంత్యక్రియలు మంగళ వారం బ్రాహ్మణ వెల్లెంలలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, మాజీ స్పీకర్ నేతి విద్యాసాగర్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నియోజకవర్గ నాయకులు నర్సింహ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.
దేవరకొండ ఎమ్మెల్యే సంతాపం
దేవరకొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నర్సింహ మృతికి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ సంతాపం తెలిపారు.
ఎమ్మెల్యే శానంపూడి సంతాపం
హుజూర్నగర్ : ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య తండ్రి నర్సింహ సోమవారం అనారోగ్యంతో మృతిచెందగా హుజూర్నగర్ ఎమ్మె ల్యే శానంపూడి సైదిరెడ్డి సంతాపం వ్యక్తం చేసి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగంపై సీఎం కేసీఆర్ ఫోన్లో సంతాపం తెలిపారు. తండ్రి అనారోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలతో పాటు పలువురు మంత్రులు ఫోన్లో మాట్లాడి చిరుమర్తిని పరామర్శించి సంతాపం తెలిపారు.