
పల్లె ప్రగతితో కంబాలపల్లికి కొత్త శోభ
అభివృద్ధి పథంలో మేజర్ గ్రామపంచాయతీ
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మండలంలోని అన్ని గ్రామాలు పరిశుభ్రం, పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అతి పెద్ద గ్రామమైన కంబాలపల్లిలో సమస్యలు తొలిగి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. గ్రామంలో సుమారు రూ.1.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు గ్రామం చుట్టూ పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నది.
దేవరకొండ పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబాలపల్లి గ్రామంలో 1200 కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో ఏ వీధి చూసినా కంపచెట్లు, మురుగు నీటి నిల్వతో అధ్వానంగా ఉండేది. ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టి నెలనెలా నిధులు ఇస్తుండడంతో సమస్యలు తీరి అభివృద్ధి బాట పట్టింది. వీధుల్లోని కంప చెట్లను తొలగించడంతోపాటు నిల్వ ఉన్న మురుగు నీటిని కాల్వలోకి మళ్లించి శాశ్వత పరిష్కారం చూపారు. గుట్టలపై ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రహదారి సైతం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించారు. గ్రామ సమీపంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి రకరకాల మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. రూ.22 లక్షలతో రైతు వేదికను నిర్మించగా.. కంబాలపల్లి, పాత కంబాలపల్లి, చిత్రియాల, పెద్దమూల, పొగిళ్ల, రేకులగడ్డ, యాపలపాయ తండా, బుడ్డోని తండా, గువ్వలగుట్ట గ్రామాల రైతులు అందులో సమావేశమై సాగు గురించి మాట్లాడుకుంటున్నారు. సమస్యలు తొలిగినయ్..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మండలంలోని అన్ని గ్రామాలు పరిశుభ్రం, పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అతి పెద్ద గ్రామమైన కంబాలపల్లిలో సమస్యలు తొలిగి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. గ్రామంలో సుమారు రూ.1.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పుడు గ్రామం చుట్టూ పచ్చని
అందాలతో కనువిందు చేస్తున్నది.
దేవరకొండ పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబాలపల్లి గ్రామంలో 1200 కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో ఏ వీధి చూసినా కంపచెట్లు, మురుగు నీటి నిల్వతో అధ్వానంగా ఉండేది. ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టి నెలనెలా నిధులు ఇస్తుండడంతో సమస్యలు తీరి అభివృద్ధి బాట పట్టింది. వీధుల్లోని కంప చెట్లను తొలగించడంతోపాటు నిల్వ ఉన్న మురుగు నీటిని కాల్వలోకి మళ్లించి శాశ్వత పరిష్కారం చూపారు. గుట్టలపై ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రహదారి సైతం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించారు. గ్రామ సమీపంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి రకరకాల మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. రూ.22 లక్షలతో రైతు వేదికను నిర్మించగా.. కంబాలపల్లి, పాత కంబాలపల్లి, చిత్రియాల, పెద్దమూల, పొగిళ్ల, రేకులగడ్డ, యాపలపాయ తండా, బుడ్డోని తండా, గువ్వలగుట్ట గ్రామాల రైతులు అందులో సమావేశమై సాగు గురించి మాట్లాడుకుంటున్నారు.
కేసీఆర్ సారుతోనే గ్రామం మంచిగైంది
గప్పుడు ఏ బజారులో చూసినా కంపచెట్లు ఉండేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఊరిని మంచిగా చేయాలని టీవీలో చెప్తుంటే.. మా సర్పంచ్ బజారులో కంప చెట్లను తీసేశారు. ఇప్పుడు బజార్లు నీటుగా ఉన్నాయి. కేసీఆర్ సారు చాలా మంచి పని చేస్తున్నారు.
అభివృద్ధిలో గ్రామాన్ని ముందుంచుతా
మా ఊర్లో ఎప్పుడూ మహిళ సర్పంచ్ కాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మహిళలకు గౌరవం ఇచ్చి సర్పంచ్ సీటులో కూర్చోబెట్టినందుకు సంతోషంగా ఉంది. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకుంటున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామం చుట్టుపక్కల, వీధుల్లో ఉన్న కంపచెట్లను తొలగించాం. గ్రామాన్ని అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉంది.
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు..
సుమారు రూ.50 లక్షలతో అన్ని వీధుల్లో సీసీ రోడ్ల ఏర్పాటు
రూ.10 లక్షలతో పాఠశాల ప్రహరీ నిర్మాణం
రూ.22 లక్షలతో రైతు వేదిక
రూ.10 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు
రూ.6 లక్షలతో పల్లె ప్రకృతి వనం
రూ.10 లక్షలతో మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం
రూ.20 లక్షలతో మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా ఇంటింటికీ నల్లాల ఏర్పాటు
వీటితోపాటు వీధుల్లో కంప చెట్ల తొలగింపు, మురుగు కాల్వల శుభ్రం తదితర పనులు
చేపట్టారు.