
నివాళులర్పించిన ఎమ్మెల్యేలు,
గౌడ సంఘాల నాయకులు
కోదాడ, ఆగస్టు 18 : బహుజనుల ఆశా కిరణం సర్దార్ సర్వాయి పాపన్న అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడలోని క్యాంపు కార్యాలయంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన రాజ్యం కోసం సుదీర్ఘ పోరాటం చేసి భువనగిరి ఖిల్లాపై స్వతంత్ర బావుటా ఎగురవేసిన విప్లవకారుడు పాపన్న అని ఎమ్మెల్యే అన్నారు. కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్, టీఆర్ఎస్ నాయకుడు వనపర్తి లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ సెక్రటరీ మేకపోతుల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, సంపేట ఉపేందర్‌గౌడ్, సోమగాని సోమేశ్గౌడ్, సత్యనారాయణ గౌడ్, సురగాని రాంబాబుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య, రాజేశ్ పాల్గొన్నారు.
పాపన్న ఆశయ సాధకు కృషి చేయాలి
తిరుమలగిరి : పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని తాటిపాములలో గౌడ సంఘం ఆధ్వర్యంలో, తిరుమలగిరిలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి బుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి,
మాజీ ఎంపీపీ సతీశ్, బత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
చివ్వెంల : కుడకుడలో బుధవారం గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాపన్న జయంతి నిర్వహించారు. గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు పంతంగి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉయ్యాల నగేశ్, పంతంగి దశరథ, బూర రవి, లక్ష్మయ్య పాల్గొన్నారు.
అర్వపల్లి : మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు నర్సింగ శ్రీనివాస్‌గౌడ్, కుంభం సోమయ్యగౌడ్, నర్సింగ కృష్ణమూర్తి, నజీర్గౌడ్, వెంకటేశ్వర్లు, సోమయ్య, యాదయ్య, సందీప్‌గౌడ్ పాల్గొన్నారు.
హుజూర్నగర్ రూరల్ : మండలంలోని బూరుగడ్డ, మాచవరంలో సర్వాయి పాపన్న జయంతిని నిర్వహించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ కమిటీ మెంబర్ యరగాని నాగన్నగౌడ్ మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలోమొదటిసారిగా సర్వాయి పాపన్న విగ్రహాన్ని బూరుగడ్డలో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. భిక్షంగౌడ్, వీరస్వామిగౌడ్, సైదులుగౌడ్, నాగరాజుగౌడ్, గురువయ్య, సర్వయ్య, వీరబాబు, నరసింహారావు, వీరస్వామి పాల్గొన్నారు.
హుజూర్నగర్ టౌన్ : హుజూర్‌నగర్‌లోని మటన్ మార్కెట్ బజార్లో పాపన్న జయంతిని నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, యరగాని నాగన్న, వెంకటేశ్వర్లు, అమర్, శ్రీనివాస్, కృష్ణ, హుస్సేన్, సత్యనారాయణ, సాయిరాం, రమేశ్, గోవింద్, హరికృష్ణ పాల్గొన్నారు.
నడిగూడెం : మండలంలోని రత్నవరంలో నిర్వహించిన కార్యక్రమంలో బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పోలంపల్లి రామకోటయ్య, వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాస్‌రావు, గురువయ్య, వీఎల్ఎన్ గౌడ్, మల్లయ్య, నరసింహారావు, రాంబాబు పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్ : పాపన్నగౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం లక్ష్మీ గార్డెన్స్‌లో జైగౌడ ఉద్యమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జైగౌడ సంఘం నాయకులు శేషగాని నరేశ్, చౌగాని సంతోష్, గునగంటి సైదులు, చీకురి కృష్ణ, కక్కిరేణి నాగయ్య, బూర బాలసైదులు, అనంతుల దుర్గాప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, జలగం సత్యం, పల్స మల్సూర్, కక్కిరేణి సత్యనారాయణ, కాంపాటి రాధాకృష్ణ, బెల్లంకొండ రామ్మూర్తి పాల్గొన్నారు.
నాగారం : మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో గౌడ సంఘం మండలాధ్యక్షుడు పొదిల రమేశ్‌గౌడ్, అనంతుల సత్తయ్య, చిత్తలూరి వెంకన్న, బొమ్మగాని జాని, కుంభం లింగయ్య, మొల్కపురి శ్రీకాంత్, కిరణ్, మహేశ్, యాదగిరి పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ : మండలంలోని పలు గ్రామాల్లో పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. పొడిశెట్టి సైదులుగౌడ్, మడ్డి అంజయ్య, లింగయ్య, వీరబాబు, బెల్లంకొండ శ్రీరాములుగౌడ్ పాల్గొన్నారు.
మునగాల : మండల కేంద్రంలోని కాటమయ్య ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నారగాని వెంకన్న, మామిడి శ్రీనివాస్, లక్ష్మయ్య, శ్రీను పాల్గొన్నారు.