
నల్లగొండ రూరల్, ఆగస్టు 17 : రాష్ట్రంలో రెండు పంటలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుండ్లపల్లి వద్ద ఏఎమ్మార్పీ కాల్వ నుంచి డి-37 కాల్వకు సాగునీరు విడుదల చేసి మాట్లాడారు. ఈ కాల్వ ద్వారా ఆరు మండలాల్లో 46వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతులు ఈ నీటిని వృథా చేయకుండా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందస్తుగా కాల్వ పరిధిలోని అన్ని చెరువులను నింపుకొని వాటిని వాడుకోవాలని సూచించారు. ఏఎమార్పీ కాల్వను విస్తరించి 3వేల క్యూసెక్కుల నీటిని పానగల్ ఉదయసముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ ఆనంద్‌రావు, డీఈ మనోహర్‌రెడ్డి, జేఈఈ సుభాశ్, సర్పంచ్ పంతంగి సరితాశ్రీనాథ్, ఎంపీటీసీలు సహదేవ్, మల్లేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, బీరం గోపాల్‌రెడ్డి, నారగోని నరసింహ, చింత సైదులు, జాన్‌రెడ్డి, బైరెడ్డి వెంకట్‌రెడ్డి, తిరుమలేశ్, జంగయ్య పాల్గొన్నారు.
నల్లగొండ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని వల్లభరావు చెరువును టూరిజం జిల్లా అధికారి శివాజీతో కలిసి పరిశీలించారు. చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి, కట్టపై గార్డెన్ లైటింగ్ పెట్టిస్తామని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నంరాజు, రావుల శ్రీనివాస్‌రెడ్డి, ఆలకుంట్ల మోహన్‌బాబు, ఇబ్రహీం ఉన్నారు.