
నల్లగొండ, ఆగస్టు 16 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన దళితబంధు సభకు జిల్లావ్యాప్తంగా దళిత, టీఆర్ఎస్ నేతలు, దళితులు స్వచ్ఛందంగా తరలివెళ్లారు. దళితుల కోసం దళితబంధు పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపడానికి భారీసంఖ్యలో సభకు ఆయా మండలాల నుంచి వెళ్లారు.
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు హుజూరాబాద్‌కు వెళ్లేందుకు బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ ప్రపంచమే ఆలోచించే స్థాయిలో సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకురావడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు. వెళ్లిన వారిలో నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, నేతలు బకరం వెంకన్న, జిల్లా శంకర్, కందుల లక్ష్మయ్య, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, సంకు ధనలక్ష్మి, నాగేశ్వర్రావు, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, సింగం రామ్మోహన్ ఉన్నారు.
ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ : దళితుల సాధికారత కోసమే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని రూపొందించారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వెళ్తున్న వాహనాలను జెండా ఊపి పంపారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, పాలుట్ల బాబయ్య,
షోయబ్, ఏడుకొండలు ఉన్నారు.
కట్టంగూర్ : మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి హుజూరాబాద్‌కు వాహనాల్లో తరలివెళ్లారు. జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు ఉన్నారు.
నార్కట్‌పల్లి : మండల టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు వెళ్లారు.
శాలిగౌరారం : మండలం నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మామిడి సర్వయ్య, గంట శంకర్, వేల్పుల నరేందర్, వేముల లింగయ్య, దుబ్బ వెంకన్న, బట్ట వీరబాబు, దాసరి వెంకన్న, కృష్ణ, వేముల పవన్, శ్రీను, గణేశ్ వెళ్లారు.
కేతేపల్లి : దళితబంధు సభకు వెళ్లిన వారిలో గుడివాడ సర్పంచ్ కట్ట శ్రవణ్‌కుమార్, నాయకులు దాసరి సుధాకర్, మీసాల ధన్‌రాజ్, షేక్ రషీద్, ఆర్.సైదులుగౌడ్, పి.ప్రభాకర్, ఎ.జోజి, జానకిరాములు ఉన్నారు.
మునుగోడు : మండలం నుంచి హుజూరాబాద్ తరలివెళ్లిన వారిలో దండు యాదయ్య, బొల్గూరి నర్సింహ, సర్పంచ్ పందుల మారయ్య, బొజ్జ శ్రీను, దొడ్డి రామకృష్ణ, వంటెపాక వెంకన్న, శరత్, దుబ్బ రవి, జీడిమడ్ల బాబు, బోయ లింగస్వామి, భీమనపల్లి సత్తయ్య, బోయపర్తి సురేందర్ ఉన్నారు.
మర్రిగూడ : దళిత టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వారిలో టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి లపంగి నర్సింహ, జిల్లా నాయకులు ఊరిపక్క నగేశ్, మాజీ సర్పంచ్ ఎడ్ల శ్రీరాములు, వర్కాల వెంకటేశ్, ఆకారపు శ్రీనివాస్, మైలారపు గిరి, జిల్లా కృష్ణయ్య, లపంగి భిక్షం, యాదగిరి, హరికృష్ణ, సంజీవ ఉన్నారు.
నాంపల్లి : మండలం నుంచి కోరె యాదయ్య, కార్నె యాదయ్య, కొలుకులపల్లి చెన్నయ్య, అందుగుల యాదయ్య, అన్నెపాక కిరణ్, దేవయ్య, వెంకటయ్య తరలివెళ్లారు.
చిట్యాల : మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, నాయకులు కొలను వెంకటేశ్, కూరెళ్ల లింగస్వామి, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, జిట్ట బొందయ్య, ముద్దసాని రమణారెడ్డి, యేళ్ల సత్యనారాయణరెడ్డి, సిలివేరు శేఖర్ హుజూరాబాద్ సభకు వెళ్లిన వారిలో ఉన్నారు.
జడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు
హాలియా : రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని దళిత సంఘం నాయకులు ఎమ్మెల్యే నోముల భగత్ సహకారంతో రెండు బస్సుల్లో దళితబంధు సభకు తరలివెళ్లారు. ఆయనతోపాటు పెద్దవూర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, అన్నెపాక శ్రీను, బందిలి సైదులు, యడవల్లి నాగరాజు, దోరేపల్లి వెంకన్న, సర్పంచులు ఉన్నారు.
నిడమనూరు : మండలం నుంచి 100మంది దళితులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సును నిడమనూరు మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా దళితబంధును ప్రారంభించి ఆర్థికాభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. దళిత నాయకులు పులిమాల కృష్ణారావు, చిత్రం జీవన్‌రావు, చిత్రం అశోక్, ప్రసాద్ ఉన్నారు.
పెద్దవూర : మండల ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పులిమాల కృష్ణారావు, మండల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటేశ్వర్లు, మాదిగ జేఏసీ నియోజకవర్గ అధ్యక్షుడు కలకొండ పరమేశ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆడెపు రామలింగయ్య, నాయకులు ఎర్ర చంద్రయ్య, దుబ్బ రవి, లక్ష్మణ్, వెంకటయ్య, ఆంజనేయులు తరలివెళ్లారు.
మాల్ : చింతపల్లి మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. మాస భాస్కర్, వింజమూరి రవి, అబ్బయ్య, ముత్యాలు, మల్లయ్య, వెంకటయ్య, మల్లేశ్, చంద్రకళ, భారతయ్యతోపాటు మండలంలోని నాయకులు హుజూరాబాద్ సభకు వెళ్లారు.
మాడ్గులపల్లి : మండలం నుంచి టీఆర్ఎస్ నాయకుడు పాలుట్ల బాబయ్య, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండి సోయబ్, రాజు తరలివెళ్లారు.
శాలిగౌరారం : హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే శోర్కుమార్ ఫ్లెక్సీకి దళిత నాయకులు సోమవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బాకి వెంకటయ్య, తీగల వెంకన్న, బట్ట గణేశ్, కోక సైదులు, బాబు, భిక్షమయ్య, ఎల్లయ్య, రాంబాబు, వెంకటరమణ పాల్గొన్నారు.