
నల్లగొండ, ఆగస్టు 16 : బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు వర్షం పడగా ఆ తరువాత ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు కురిశాయి. అత్యధికంగా కేతేపల్లిలో 50.4 మి.మీ వర్షం పడగా, మిర్యాలగూడలో 34.5, కట్టంగూర్‌లో 29.5, నకిరేకల్‌లో 29, త్రిపురారంలో 27.3, దామరచర్లలో 26.7, అనుములలో 24.1, మాడ్గులపల్లిలో 23.8, గుండ్లపల్లిలో 23.6, వేములపల్లిలో 21.9, గుర్రంపోడ్లో 21.8, శాలిగౌరారంలో 20.0, తిప్పర్తిలో 19.5, నిడమనూరులో 17.2, చండూర్లో 15.3, నాంపల్లిలో 15.1, నార్కట్‌పల్లిలో 14.1, నల్లగొండలో 13.6, తిర్మలగిరి సాగర్‌లో 13.3, చిట్యాలలో 13.2, కనగల్‌లో 13.2, పీఏపల్లిలో 13.0, మునుగోడులో 12.1, చింతపల్లిలో 12.0, చందంపేటలో 9.2, కొండమల్లేపల్లిలో 8.8, దేవరకొండలో 8.5, పెద్దవూరలో 7.7, నేరేడుగొమ్ములో 5.5 మిమీ వర్షం పడింది. అత్యల్పంగా మర్రిగూడలో 2.1 మి.మీ కురిసింది. జిల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 546 మిమీ వర్షం పడగా 17.6 మిమీ సగటు వర్ష పాతం నమోదైంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో 301.6 మిమీ వర్షం పడాల్సి ఉండగా 407.9 మిమీ కురిసి 35 శాతం అదనపు వర్షపాతం నమోదైంది.
సూర్యాపేట : జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సోమవారం మొత్తం చిరు జల్లులు కురిశాయి. జిల్లాలో అత్యధికంగా తిరుమలగిరి మండలంలో 67.0 మిల్లీ మీటర్లు కురియగా, నాగారంలో 42.8, అనంతగిరి 35.9, మద్దిరాల 32.6, నేరేడుచర్ల 32.2, గరిడేపల్లి 31.1, మఠంపల్లి 28.9, జాజిరెడ్డిగూడెం 28.6, పెన్‌పహాడ్ 28.6, ఆత్మకూర్(ఎస్) 22, సూర్యాపేట 21.7, చిలుకూరు 18.8, తుంగతుర్తి 18.5, కోదాడ 16.8, నూతన్‌కల్ 16.6, పాలకవీడు 16, హుజూర్నగర్ 15.2, చివ్వెంల 14.9, మేళ్లచెర్వు 14.4, మోతె 12.7, నడిగూడెం 10.2, చింతలపాలెం 8.5, మునగాల 6.4 మి.మీ వర్షం కురిసింది. 23.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.