
కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం వృథా కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టింది. అయితే తరగతి బోధన లేకపోవడంతో విద్యార్థులు కొంత మేరకు పాఠ్యాంశాలు అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది విద్యార్థులు ఇంటి పనుల్లో ఇంకొందరు తలిపుస్తకాలపై క్యూఆర్ కోడ్
దీక్ష యాప్‌తో మళ్లీ, మళ్లీ వినే అవకాశం
స్వప్న 8వ తరగతి చదువుతున్నది. మొబైల్ ద్వారా ఆన్లైన్ తరగతులు వింటున్నది. అయితే, మధ్యలో చార్జింగ్, సిగ్నల్ సమస్యలతో పాఠాలు సరిగా వినలేదు. తర్వాత రోజు సందేహాలను నివృత్తి చేసుకుందామంటే టీచర్ ఏమంటారోనని, తోటి విద్యార్థులు ఏమనుకుంటారోననే భయం పట్టుకున్నది.
చింటు పదో తరగతి చదువుతున్నాడు తరగతిలో రెండు సార్లు వింటే కానీ లెక్కలు అర్థం కావు. అలాంటిది
ఆన్లైన్లో టీచర్లు ఒకసారి మాత్రమే చెబుతుండడంతో ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. ప్రస్తుత
పరిస్థితుల్లో ప్రైవేటు ట్యూషన్‌కు వేళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇటు విద్యార్థి, అటు తల్లిదండ్రులు
అందోళన చెందుతున్నారు. ఈ సమస్య వీరిదే కాదు.. చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నదే.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ కొత్త మార్పులు తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలపై, ప్రతి పాఠం మధ్యలో క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించింది. విద్యార్థులకు ఏవైనా సందేహాలున్నా, తరగతులకు
హాజరు కాలేకపోయినా మొబైల్ ద్వారా స్కాన్ చేసుకుని పాఠం మళ్లీ వినే అవకాశం కల్పించింది. తల్లిదండ్రులతో కలిసి ఇతర పనులకు వెళ్తున్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడుతూ, పాడుతూ గడిపేస్తున్నారు. ఆన్లైన్ బోధనలో అర్థం కాని పాఠ్యాంశాలను తిరిగి ఉపాధ్యాయుడిని అడుగాలంటే విద్యార్థులు భయానికి లోనవుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి విద్యాశాఖ సరికొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించి దానికి వీడియో రూపకల్పన చేసి పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని పాఠ్యపుస్తకాలకు క్యూర్ కోడ్‌ను ముద్రించి నూతన విధానానికి తెర తీశారు.
విద్యార్థులు మొబైల్లోని ప్లేస్టోర్ లోకి వెళ్లి ‘దీక్ష’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం తెలుగు, ఇంగ్లిష్, హిందీ మీడియానికి సంబంధించి భాషను ఎంచుకోవాలి. అనంతరం క్యూఆర్ కోడ్ స్కానింగ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి పాఠ్య పుస్తకంలో ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేస్తే ఆ పాఠ్యాంశానికి సంబంధించి సమగ్ర వివరాలతో వీడియో పాఠాలు ప్రత్యక్షమవుతాయి.
ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేశారు. కానీ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ విభాగాల వారికి మాత్రమే ఈ విధానాన్ని అమలు చేశారు. మిగతా గ్రూపుల వారికి క్యూఆర్‌కోడ్ వెసులు బాటు లేదు. గణిత, భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్ర్తాలకు సంబంధించిన పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారు.
కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర విద్యాశాఖ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. దీంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులు క్యూఆర్ కోడ్‌ను సద్వినియోగం చేసుకుని వీడియో పాఠాల ద్వారా చక్కగా అర్థం చేసుకుని తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలి.