
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
తక్షణ మరమ్మతులకు రూ. 13 లక్షలు
మునగాల, సెప్టెంబర్ 8 : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్త్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండలంలోని గణపవరం గ్రామ శివారులో కోతకు గురైన రోడ్డును కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రోడ్డు మరమ్మతుకు మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో అంచనాలు రూపొందించి తాత్కాలిక మరమ్మతుకు రూ .13 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రూ .5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎలక బిందు, జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల, సర్పంచులు కొండపల్లి విజయ నర్సింహా రావు, సొసైటీ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, చందా చంద్రయ్య, నాయకులు ఉప్పుల యుగేందర్‌రెడ్డి, కోల ఉపేందర్‌రావు, కేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, గౌని శ్రీనివాస్, జితేందర్‌రెడ్డి, బుర్రి శ్రీరాములు, మెదరమెట్ల వెంకటేశ్వరావు, దేవరం వెంకటరెడ్డి, చందా రామకృష్ణ, ఎస్ఐ శ్రీనివాసులు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ భూపాల్‌రెడ్డి, వీఆర్వో సంజీవరావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతే లక్ష్యం..
కోదాడ : పేదల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ, అనంతగిరి మండలాలకు చెందిన 43 మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 13,55,000 విలువైన చెక్కులను, ఐదుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిశోర్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, చుండూరు వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్ రావు, నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, వెంపటి మధు, మధుసూదన్, గింజుపల్లి రమేశ్, సంపేట ఉపేందర్ పాల్గొన్నారు.
విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలి
కోదాడ టౌన్ : గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా అన్నిఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులకు సూచించారు. పట్టణంలోని పెద్ద చెరువు వద్ద ఏర్పాట్లను రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. నిమజ్జన ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, తాగునీరు, విద్యుద్దీపాలతోపాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ కిశోర్‌కుమార్, ఎంపీపీ చింతా కవితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు, పట్టణ సీఐ నరసింహా రావు, గణేశ్ ఉత్సవకమిటీ అధ్యక్షుడు యాదా రమేశ్, టీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, మత్స్యశాఖ చైర్మన్ వీరస్వామి, కందుల చంద్రశేఖర్ ఉన్నారు.