
పార్టీని వీడనున్న చండూరు
మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న
నేడు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక
మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా..
పార్టీని వీడనున్న చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న
నేడు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక
చండూరు, అక్టోబర్ 3 : చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాంగ్రెస్ తరఫున గెలిచిన ఏకైక మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న కూడా కాంగ్రెస్‌ను వీడనున్నారు. ఈమెతో పాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి తీరుపై అసంతృప్తితో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, తేరట్పల్లి సర్పంచ్ శ్రీశైలం, మర్రిగూడెం ఎంపీపీ మెండు మెహన్‌రెడ్డి, చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చం డూరు నాలుగో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ బహిరంగంగానే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఎమ్మెల్యే మాటలు చిన్న పిల్లవాడి చేష్టలుగా ఉంటాయని, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అతడికే తెలువదన్నారు. ఇతడి చేష్టల వల్ల మునుగోడు నియోజకవర్గం వెనుకబాటుకు గురవుతుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.
ఎమ్మెల్యే తీరుతోనే..
గంటకో మాటా పూటకో పార్టీ గురించి మాట్లాడే ఎమ్మెల్యే తీరుతో ఆ పార్టీ కార్యకర్తల్లో అయోమాయం నెలకొంది. మున్సిపాలిటీ అభివృద్ధ్ది చెందాలంటే కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్నువీడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలతో పాటు ఇతర పార్టీల పజాప్రతినిధులు సైతం టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధ్ది కోసమే..
చండూరు మున్సిపల్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నా. మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చొరవతో చండూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. ఎన్నికల ముందు ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమోదయోగ్యమైనవి వాటిని ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.
ఎమ్మెల్యే తీరు నచ్చక పార్టీని వీడుతున్నా..
రాష్ట్రంలోనే విచిత్రమైన ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి ఉండడం సిగ్గు చేటు . పూటకో మాట, గడియకో పార్టీ గురించి మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్న అతడి తీరు నచ్చక పార్టీని వీడుతున్నా. ఆయన మాయ మాటలకు మోసపోయిన వారు నియోజకవర్గంలో ఎంతో మంది ఉన్నారు. మతిస్థిమితం లేని ఎమ్మెల్యేతో అభివృద్ధి కుంటుపడుతుంది. మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలి అందుకే టీఆర్ఎస్లో చేరుతున్నా.
-అన్నెపర్తి శేఖర్, కౌన్సిలర్, చండూరు.