సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు మంగళవారం తెరుచుకున్నాయి. సంక్రాంతి పండుగతోపాటు కరోనా కారణంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించగా 24 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. మాస్కులు ధరించి, శానిటైజర్ వెంట పెట్టుకొని విద్యార్థులు బడికి రాగా సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి పంపించారు. తొలిరోజు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 17,450 మంది(28శాతం), ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 11,375 మంది (30 శాతం) హాజరయ్యారు.
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 1: సంక్రాంతి, కరోనా ఉధృతి కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. 24 రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పునఃప్రారంభమయ్యాయి. జిల్లాలోని 734 ప్రభుత్వ పాఠశాలలు, 156 ప్రైవేట్ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనల మేరకు పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, చేతులను శానిటైజ్ చేసి తరగతి గదుల్లోకి పంపించారు. విద్యార్థులు మాస్కులు ధరించి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. సోమవారమే పాఠశాలల్లో గదులు, మురుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 62,765 మంది విద్యార్థులకు మొదటి రోజు 17,450(28 శాతం)మంది హాజరయ్యారు. ప్రైవేట్ పాఠశాలల్లోని 38,236 మంది విద్యార్థులకు 11,375(30 శాతం)మంది వచ్చారు.
జాగ్రత్తలు పాటించేలా చర్యలు