
6 డైరెక్టర్ స్థానాలకు నేడు నోటిఫికేషన్
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్(నార్మాక్స్)లో ఖాళీ అవుతున్న ఆరు డైరెక్టర్ స్థానాల భర్తీకి బుధవారం ఎన్నికల నోటిఫికేషన్
విడుదల కానున్నది. ఈ నెల 17 నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని పాలకవర్గం నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్లో 3 డైరెక్టర్ స్థానాలు ఖాళీ అవగా, అదే నెలలో ఎన్నికలు 17 నుంచి నామినేషన్ల స్వీకరణ 28న పోలింగ్, కౌంటింగ్
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్(నార్మాక్స్)లో ఖాళీ అవుతున్న ఆరు డైరెక్టర్ స్థానాల భర్తీకి బుధవారం ఎన్నికల నోటిఫికేషన్
విడుదల కానున్నది. ఈ నెల 17 నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని పాలకవర్గం నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్లో 3 డైరెక్టర్ స్థానాలు ఖాళీ అవగా, అదే నెలలో ఎన్నికలు
నిర్వహించాల్సి ఉన్నా కరోనా పరిస్థితుల వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నెలలో షెడ్యూల్ ప్రకారం మరో 3 డైరెక్టర్ స్థానాలు ఖాళీ కానున్నాయి. దాంతో మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నార్మాక్స్ పాలకవర్గం సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. గత నెల 17న నిర్వహించిన పాలకవర్గం సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకే ఖాళీ అవుతున్న ఆరు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకుగాను నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కాగా పాలకవర్గంలో మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు గానూ ఏటా మూడు స్థానాలు ఖాళీ అవుతుంటాయి. ఈ మూడింటికీ వెంటనే ఎన్నికలు నిర్వహించి భర్తీ చేయడం ఆనవాయితీ. అదే ప్రకారంగా ఈ సారి కూడా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దాదాపు నార్మాక్స్లో డైరెక్టర్ స్థానాలకు జరిగే ఎన్నికలు ఎక్కువభాగం ఏకగ్రీవంగానే ముగుస్తుండడం విశేషం.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
ఈ నెల ఒకటో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.
17 నుంచి 22 వరకు నామినేషన్ ఫారాల విక్రయం
20 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ
23న నామినేషన్ల పరిశీలన
24న ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ. వెంటనే తుది జాబితా విడుదల
28న ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ (ఏకగ్రీవం కాని పక్షంలో).
మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి
29న ఉదయం 11గంటలకు కొత్త డైరెక్టర్లతో కలిపి పాలకవర్గ సమావేశం. చైర్మన్ ఎన్నిక.