మధుసూదనశర్మ రచించిన పుస్తకాలు బాగున్నాయని లేఖ
భవిష్యత్‌లో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆకాంక్ష
కొల్లాపూర్ కవికి ఉపరాష్ట్రపతి అభినందన
కొల్లాపూర్, ఆగస్టు 21 : కొల్లాపూర్‌కు చెందిన కవి, రచయిత, సాహితీవే త్త, తెలుగు భాషోపాధ్యాయుడు వేదా ర్థం మధుసూదనశర్మని ఉపరాష్ట్రపతి అభినందించారు. శర్మ రచించిన సమాలోకనం, పరంపర పుస్తకాలను పరిశీలించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెం కయ్యనాయుడు అభినందిస్తూ శనివా రం లేఖ పంపారు. మీరు రచించిన పు స్తకాలు చదివితే ఎంతో ఆనందం కలిగిందని లేఖలో పేర్కొన్నారు. దేశ పురా ణ ఇతిహాసాలు, చరిత్రలో ఆదర్శనీయమైన జీవితం గడిపిన ఎందరో మహనీయుల గురించి, సంప్రదాయాల గురించి యు వత తెలుసుకోవాలనుకునే నా ఆకాంక్షకు అనుగుణంగా ఉన్నదని ఆయనన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.