నవాబ్‌పేట, సెప్టెంబర్ 12 : ప్రతిపక్ష పార్టీల నాయకులు కొంతమంది గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పార్టీని వి మర్శిస్తున్నారని, అలాంటి వారి విమర్శలను నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తిప్పికొట్టాలని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మండల ప రిధిలోని అమ్మాపూర్‌లో ఆదివారం రాత్రి పార్టీ జెండావిష్కరణ చేసి.. ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు..తమ ఉనికి కోసం మతిభ్రమిం చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 50 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలు చేపడుతున్నారన్నారు. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాడన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలు ఎందుకు అమలు చేస్తున్నారని నిలదీశారు. గత సమైక్య పాలనలో గుక్కెడు మంచినీటి కోసం అరిగోస పడ్డ విషయాన్ని మరిచిపోలేదన్నారు. అనంతరం చెన్నారెడ్డిపల్లిలో హై మాస్ట్లైట్లను ప్రారంభించారు. కార్యక్రమం లో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శీనయ్య, రైతుబంధు మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, అమ్మాపూర్ సర్పంచ్ సత్యం, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రా మ కమిటీ అధ్యక్షుడు యాదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బ్రోచర్ ఆవిష్కరణ
జడ్చర్ల, సెప్టెంబర్ 12 : జడ్చర్ల మున్సిపాలిటీలోని 3వ వార్డు సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంతంలో నూతనంగా నిర్మితమవుతున్న నారాయణ ఎలైట్ అపార్ట్మెంట్ ప్లాట్ల సముదాయానికి సంబంధించిన బ్రోచర్‌ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారిక తదితరులు పాల్గొన్నారు.