కరువులో అధికమాసం
నిన్నటి వరకు స్మార్ట్ ఫోన్లు, రీచార్జీలకు..
నేటి నుంచి పుస్తకాలు, బ్యాగులు, సామగ్రికి..
తడిసి మోపెడవుతున్న ఖర్చులు
పాఠశాలల పునఃప్రారంభంతో తల్లిదండ్రుల తిప్పలు
ఆత్మకూరు, ఆగస్టు 30 : కరోనా కాలంలో అంతంతమాత్రంగా నెట్టుకొస్తున్న పి ల్లల చదువులు పాఠశాలల పునఃప్రారంభంతో మరింత భారంగా మారనున్నాయి. ఒక విద్యాసంవత్సరం మొత్తం పాఠశాలలకు పంపకుండా ఆన్లైన్ క్లాసుల పేరిట స్మార్ట్ఫోన్లకు పరిమితమైన పిల్లలను సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సమాయత్తమవుతున్నారు. గతేడాది నుంచి ఆన్లైన్ క్లాసులతో స్మార్ట్ఫోన్లు, డేటా రీచార్జిలు, పా ఠశాల ఫీజులు, తరగతులు వినేలా సదుపాయాల ను కల్పిస్తూ నిత్యం పిల్లల వ్యవహారాలపై నిఘాపెట్టి న తల్లిదండ్రులు.. పాఠశాలల ప్రారంభంతో ‘స్మార్ట్’ వ్యసనం తప్పనున్నదని ఆనందిస్తున్నారు. పిల్లల ప్ర వర్తన, శైలిపై తీవ్ర ప్రభావం చూపిన ఆన్లైన్ చదువులు.. ఇక నుంచి బంద్ అవుతున్నాయన్న సంతో షం కంటే ఆఫ్‌లైన్ చదువుల పెట్టుబడిని తలుచుకొ ని నివ్వెరపోతున్నారు. పాఠశాలల ప్రారంభం తో కరోనా ముందు కాలం మాదిరి పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం, షూష్, ఇతర విద్యాసామగ్రి కొనుగోలు ఓ ఎతైతే.. పాఠశాలల ఫీజులు మరో ఎత్తుగా మారాయి.
విద్యారంభం.. ‘కష్టే’ష్యామి..
సాధారణ రోజుల్లో ఎండాకాలం సెలవులు ముగిశాక జూన్ ప్రారంభంలో తెరుచుకునే పాఠశాలలకు తల్లిదండ్రులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేవా రు. కరోనా కాటుతో పరిస్థితులన్నీ తారుమారయ్యా యి. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఏడాదికి పైగా ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ.. వసతు లు ఉన్న వారు తరగతులు విన్నారు.. లేనివారు వదిలేశారు.. చాలామంది తల్లిదండ్రులు ప్రత్యేక తరగతుల కోసం స్మార్ట్ఫోన్లు, ట్యా బ్లు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచా రు. దీనికితోడు ప్రైవేటు పాఠశాలల ఫీజుల మోతల ను భరించారు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభిస్తుండడంతో ప్రత్యక్ష తరగతులకు సిద్ధమవుతున్నారు.
అదనపు ఖర్చులతో బెంబేలు..
ఏడాదిన్నరగా పాఠశాలలు లేనందున విద్యార్థు లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో యూనిఫామ్స్ చిన్నగా మారాయి. బ్యాగులు చిరిగిపోయా యి. పుస్తకాలు లేకున్నా ఆన్లైన్ యాప్‌లతో సరిపెట్టుకున్నారు. సైకిళ్లు వినియోగం లేక చెదలుపట్టా యి. ప్రస్తుతం వీటన్నింటినీ ఏర్పాటు చేసుకోవాల్సి న పరిస్థితి ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు అదన పు ఖర్చులను తలుచుకొని బెంబేలెత్తుతున్నారు. డే స్కాలర్స్ విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. రె సిడెన్షియల్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. చదువేది ఎంతమాత్రమో కానీ.. పిల్లలకు ఏ హానీ జరగరాదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సామగ్రినంతా కొనుగోలు చేసి పాఠశాలలకు సిద్ధం చేసినా.. థర్డ్‌వేవ్ ముప్పు వాటిల్లితే పరిస్థితి ఎంటి అని భయపడుతున్నారు. వీటిపై ఎవరికీ అవగాహన లేకపోవడంతో గత్యంతరం లేక స్కూల్ యజమాన్యం ఆదేశాలను పాటించేందుకు మోయలేని భారంతో సిద్ధమవుతున్నారు.
వ్యాపారాలకు ఊపిరి..
పాఠశాలల ప్రారంభం అనేక రంగాలకు ఊపిరినిస్తుంది. ఫీజులు లేక, అద్దె భవనాల కిరాయిలు కట్టలేక, బస్సుల వాయిదాలు కట్టుకోలేక, ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడిన ప్రై వేట్ పాఠశాల యాజమాన్యాలు సంతోషంగా ఉ న్నారు. స్టేషనరీ దు కాణాల్లో నోటుపుస్తకాలు, బ్యాగులు, వి ద్యా సామగ్రిని విక్రయాల కు సిద్ధం చేశారు. విద్యార్థుల ను స్కూళ్లకు చేర్చే ఆటోలు, ఇత ర వాహనదారులకు సైతం ఉపాధి లభించనున్నది. ఇలా వస్త్రవ్యాపారు లు, టైలర్లు, షూమార్ట్, బ్యాగులు, రెడీమేడ్ షా ప్స్, సైకిల్ రిపేర్, చివరాఖరుకు పాఠశాలల సమీపంలో ఉండే చిన్న చిన్న చిరుతిండ్ల డబ్బాల వ్యాపారాలన్నీ కళ సంతరించుకున్నాయి.