మహేశ్వరం: మహేశ్వరం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమగల్లచంద్రయ్యను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరామర్శించారు. చంద్రయ్య గత రెండు రోజులుగా అస్వస్థతకు గురి కావడంతో నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి నాంపల్లి కేర్ ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యపరిస్థితులను అక్కడి డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు.ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు.