
గులాబ్ తుఫాన్ రైతులను గుబులు పుట్టిస్తున్నది.. రైతన్నలు ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా రక్షించుకుంటున్న పంటలకు అతివృష్టి కారణంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నది. కూరగాయ పంటలతో పాటు వాణిజ్య, వ్యాపార పంటలు, వరి వంటి ధాన్యం పంటలు వాన నీటితో చేతికిరాకుండాపోతున్నాయి. కాగా ఇలాంటి ఆపత్కాలం రైతులు కొన్ని జాగ్రతలు తీసుకుంటే పంటలను రక్షించుకునే వీలుందని ఉద్యాన వనశాఖ అధికారులు సూచనలిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఉద్యానవనశాఖ అధికారిణి శైలజ ఉద్యాన వన పంటలను రక్షించుకోవడానికి రైతులకు సూచనలు చేస్తున్నారు.సాధారణ వర్షపాతం పంటలకు ఎంత మేలు చేస్తుందో.. అధిక వర్షపాతం అంత నష్టం చేకూరుస్తుంది. అందుకని అధిక వర్షాలు పడినప్పుడు కొన్ని జాగ్రతలు తీసుకుంటే పంటల నష్టం కొంత మేర తగ్గించవచ్చని చెబుతున్నారు.
పొలాల్లో నీరు నిల్వ ఉంటే..
చేలలో నీరు నిల్వ ఉంటే వీలైనంత త్వరగా నీటిని తొలగించాలి. పొలాల్లో నీరు నిల్వ ఉంటే చీడపీడల ఉధృతి పెరుగుతుంది. వేరు కుళ్లి మొక్కలు చనిపోతాయి. భూమిలో పోషకాలు అందవు. విత్తనాలు మొలకెత్తవు. గాలిలో తేమ పెరగడంతో రక్షిత గృహా(పాలిహౌస్, నెట్‌హౌస్)ల్లో కూడా బూడిద తెగులు, ఇతర తెగుళ్ల ఉధృతి పెరుగుతుంది.
ఇలా చేయండి..
పొలాల్లో వీలైనంత త్వరగా అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. పొలంలో చనిపోయిన మొక్కలను తీసేసి, కొత్త మొక్కలు నాటుకోవాలి. వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా తోటల్లో చెట్ల మధ్య దున్నడంతో తేమ త్వరగా ఆరి చెట్లు కోలుకుంటాయి. అధిక గాలులకు వేళ్లతో సహా ఒరిగిన చెట్లను లేపి నిలబెట్టి, మట్టిని ఎగదోసి ఊతమివ్వాలి. పంట ఎదుగుదలకు ఎరువులను వేసుకోవాలి. ముఖ్యంగా యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఇవ్వాలి. అధిక తేమ, పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి.
మామిడి, జామ, సపోటా తోటల్లో..
కూరగాయ పంటల్లో..
పాలీ/నెట్‌హౌస్‌లలో..
పూలతోటలో..
పత్తిపంటలో యాజమాన్య పద్ధతులు
పత్తి పొలంలో అధికంగా తేమ ఉంటే వేళ్లు పోషకాలను గ్రహించలేక, ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. దీంతో ఎదుగుదల తగ్గుతుంది. ఈ క్రమంలో పైరుపై 20 గ్రాముల యూరియా, లేదా 10 గ్రాముల డీఏపీ, ఫార్మలా 4 లేదా ఫార్మ లా 6ను లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే మొక్కలు త్వరగా కోలుకుంటాయి. తేమ అధికంగా ఉన్నప్పుడు పత్తిని ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీనికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. భూమిలో అధిక తేమ ఉంటే, వేరుకుళ్లు పైరును ఆ శించడంతో లేత మొక్కలు వడలిపోయి, అర్ధంతరంగా ఎండిపోతాయి. ప్యూజెరియం ఎండు తెగులు, పారా ఎండుతెగులు ఆశిస్తే, 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రాము కార్బెండిజమ్(రిడోమిల్) లీటరు నీటిలో కలిపి మొక్క మొదల్లో తడపాలి. పత్తిలో మెగ్నీసియం ధాతు లోపం గమనిస్తే, 20గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరి పంటలో..
వర్షాలు తగ్గిన వెంటనే వరిపై ఎకరాకు 35 కి లోల యూరియా, 20 కిలోల మ్యూరేటు ఆఫ్ పొ టాష్+స్ప్రింట్ 70 గ్రాముల ఎరువులను వేయాలి. వరిలో పొడ తెగులు గమనిస్తే, 2 మి.లీ. హెక్సాకొనాజోల్ లేదా వాలిడా మైసిన్లేదా ప్రాపికొనాజోల్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి మరో 15 రోజులకు మందు మార్చి పిచికారీ చేయాలి. అధిక తేమను తట్టుకోవడానికి పొటాషియం నైట్రేట్ (13-0-45) లేదా మల్టీకె(19:19:19) 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొలంలో నీటి నిల్వలు ఉంటే, కాల్వల ద్వారా నీటిని బయటకు పంపాలి. కందిలో ఎండు తెగులు ఆశిస్తే, 3గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్, 1గ్రా. కార్బెండిజమ్, లీ. నీటికి కలిపి మొక్క మొదల్లో తడపాలి.
మొక్కజొన్న సాగులో..
మొక్క జొన్న అధిక తేమను తట్టుకోలేదు. వర్షం తగ్గిన వెంటనే అంతర కృషి చేసి ఎకరాకు 25-30 కిలోల వరకు యూరియా, 15 కిలోలు పొటాష్ వే యాలి. బాక్టీరియాతో కాండం కుళ్లిపోయే ప్రమా దం ఉన్న క్రమంలో నివారణకు క్వింటాలు వేప పిండి, 4 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను సాళ్ల మధ్యలో చల్లాలి. ఆకుమచ్చ తెగులు సోకితే, డైథేన్యమ్ 45 2, 5 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే పంటలను కాపాడుకోవచ్చు.