e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జిల్లాలు పండుగ కిక్..!

పండుగ కిక్..!

  • ఒక్కరోజులో రూ.6.89 కోట్ల మద్యం విక్రయాలు
  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏరులై పారిన మద్యం
  • ఊహించని విక్రయాలు… ఖజానాకు భారీగా ఆదాయం
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లిక్కర్‌ రూ. 5.75 కోట్లు, బీర్లు రూ.1.14 కోట్ల విక్రయాలు
  • ఉమ్మడి జిల్లాలో 193 వైన్స్‌లు

దసరా వేళ మద్యం ఏరులై పారింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గురువారం ఒక్క రోజే రూ.6.89 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మెదక్‌ ఐఎంఎల్‌ డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని వైన్స్‌లు, బార్ల నిర్వాహకులు మద్యం తీసుకెళ్లి విక్రయించారు. ఇందులో 8,347 కేసుల లిక్కర్‌ విక్రయాలకు గాను రూ.5.75 కోట్లు , 7,313 కేసుల బీర్ల విక్రయాలతో రూ.1.14 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు సమకూరింది.

మెదక్‌, అక్టోబర్‌ 16: దసరా పండుగ నేపథ్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. మెదక్‌ ఐఎంఎల్‌ డిపో నుంచి ఈ నెల 14న రూ.6.89 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుపుకొనే పండుగ దసరా. రెండేండ్ల నుంచి కరోనా వ్యాప్తి ఉండడంతో పండుగను నిరాడంబరంగా జరుపుకొన్న ప్రజలు ఈయేడు ప్రభుత్వం టీకాలను ఇస్తూ, భయాన్ని విడగొట్టింది. దీంతో ఈసారి దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మద్యం ప్రియులు కేవలం ఒక రోజులోనే కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు. దీంతో ఎక్సైజ్‌శాఖ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి చేరింది.

- Advertisement -

రూ.6.89 కోట్ల మద్యం అమ్మకాలు..

దసరా పండుగ నేపథ్యంలో మెదక్‌ ఐఎంఎల్‌ డిపో నుంచి ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వైన్స్‌లు, బార్ల నిర్వాహకులు మద్యం తీసుకెళ్లి విక్రయించారు. ఉమ్మడి జిల్లాలో 193 వైన్స్‌లు ఉండగా, ఒక్క రోజులోనే రూ.6 కోట్ల 89 లక్షల 56వేల మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి చేరింది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8347 కేసుల లిక్కర్‌కు గానూ రూ.5 కోట్ల 75 లక్షల 6వేలు కాగా, బీర్లు 7313 కేసులకు గాను రూ.కోటి 14లక్షల 5వేల మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తంగా 15వేల 660 కాటాన్లకు గాను రూ.6 కోట్ల 89 లక్షల 56వేల 906 విక్రయించారు. ఇదిలావుండగా, అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు 55,456 మద్యం కాటాన్లకు గాను రూ.3 కోట్ల 75 లక్షల 992 ఆదాయం రాగా, బీర్లకు 40,665 కాటాన్లకు రూ.6కోట్ల 33 లక్షల 79వేల376 మద్యాన్ని లిఫ్ట్‌ చేశారు. మొత్తంగా 96,121 కాటాన్లకు గాను రూ.43 కోట్ల 93 లక్షల 71వేల 674 విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు.

మెదక్‌ జిల్లాలో రూ.3 కోట్ల విక్రయాలు..

దసరా పండుగ సందర్భంగా మెదక్‌ జిల్లాలోనే రూ.3 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 38 వైన్స్‌ దుకాణాలు, 2 బార్‌ షాపులు ఉన్నాయి. 3,606 కేసుల మద్యం, 3,441 బీర్ల కేసులకు గానూ రూ.3 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి 13 వరకు 23,482 లిక్కర్‌ను లిఫ్ట్‌ చేశారు. బీర్లు 16,936 కేసులను విక్రయించగా, మొత్తంగా రూ.18కోట్ల 35 లక్షల మద్యం విక్రయాలు జరిగాయి. కాగా, ఈసారి బార్లు, రెస్టారెంట్ల కంటే వైన్స్‌ షాప్‌ల ద్వారా ఎక్కువగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే లిక్కర్‌తో పోలిస్తే బీర్లు మాత్రం తక్కువే అమ్ముడుపోయాయి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement