రామాయంపేట, సెప్టెంబర్ 12: రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామ అధ్యక్షుడిగా రామకిష్టయ్యను ఎం పిక చేసినట్లు మండల అధ్యక్షుడు పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి అన్నారు.ఆదివారం గ్రామ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ జ్యోతి, ఎంపీటీసీ జ్యోతి, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, పోచయ్య గ్రామ జాబితాను అందజేసినట్లు వారు తెలిపారు.
చల్మెడ గ్రామంలో…
నిజాంపేట,సెప్టెంబర్12: చల్మెడ గ్రామంలో సర్పంచ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నూతన టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మల్లేశం,ఉపాధ్యక్షులు గా రవి, స్వామి, రాజయ్య, మోహన్‌రెడ్డి, కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా ఎల్లగౌడ్ను కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం సర్పంచ్ నర్సింహారెడ్డి అధ్యక్షుడికి నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తు మ్మల రమేశ్, వార్డు సభ్యులు కిష్టయ్య, టీఆర్ఎస్ నాయకు లు నాగరాజు, నర్సయ్య, బుచ్చయ్య, రాములు, సిద్ధిరాములు,పర్శరాములు,గ్రామస్తులు ఉన్నారు.
ఎనగండ్ల గ్రామ కమిటీ ….
కొల్చారం, సెప్టెంబర్ 12: టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఎనగండ్ల టీఆర్ఎస్ గ్రా మకమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.అధ్యక్షుడిగా వెంకటేశం, ఉపాధ్యక్షుడిగా నవీన్‌గౌడ్, కార్యదర్శిగా సత్యాగౌడ్, సంయుక్త కార్యదర్శిగా నగేశ్, కోశాధికారిగా జోగయ్య, కార్యవర్గ సభ్యులుగా కుమ్మరి అశోక్, నాగరాజు, సాయిలు, పోతరాజు దావిద్, దూదేకుల యాదుల్లా, రామన్నగారి సంగమేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వీరికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్, శ్రీనివాస్‌గౌడ్, కొరబోయిన పెంటయ్య పాల్గొన్నారు.
8 గ్రామాల్లో గ్రామ కమిటీ ఎన్నికలు …
నర్సాపూర్, సెప్టెంబర్ 12: టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలు 8 గ్రామాల్లో ఎన్నుకున్నామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. కాగజ్మద్దూర్ గ్రామ అధ్యక్షుడిగా ధశరథం, ఉపాధ్యక్షుడిగా నర్సింహులు, ఖాజీపేట్‌లో అధ్యక్షుడిగా దత్తరామశర్మ, ఉపాధ్యక్షుడిగా మల్లేశ్, ఆద్మాపూ ర్లో అధ్యక్షుడిగా సత్తయ్య, ఉపాధ్యక్షుడిగా నర్సింహులు, జక్కపల్లిలో అధ్యక్షుడిగా శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడిగా సంగగౌడ్, మహ్మదాబాద్‌లో అధ్యక్షుడిగా శంకర్, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్, నారాయణపూర్‌లో అధ్యక్షుడిగా పోచయ్య, ఉపాధ్యక్షుడిగా రేవుజ, నర్సింగ్ తండాలో అధ్యక్షుడిగా జైరా మ్, ఉపాధ్యక్షుడిగా బిక్కు, ఎల్లారెడ్డిగూడతండాలో కాట్రోత్ రెడ్యా, ఉపాధ్యక్షుడిగా మాలవత్ గోపాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆయన వెల్లడించారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్, సెప్టెంబర్ 12: తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామకమిటీ ఎ న్నికలు జోరుగా సాగుతున్నాయి. మనోహరాబాద్ మండ లం కాళ్లకల్‌లో మండల అధ్యక్షుడు మహేశ్వర్ అధ్యక్షతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడిగా శ్రీధర్‌ను, ప్రధాన కార్యదర్శిగా మహేశ్, ఉపాధ్యక్షుడి గా బాలేశ్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎం పీపీ నవనీతరవి, యూత్ అధ్యక్షుడు రాహుల్‌రెడ్డి, నాయకు లు నత్తి మల్లేశ్, ఇంద్రసేన, రాజు పాల్గొన్నారు.
తూప్రాన్‌లో..
తూప్రాన్ మండలం ఇమాంపూర్‌లో మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి అధ్యక్షతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నూ తన అధ్యక్షుడిగా వెంకటయ్యను ఎన్నుకున్నారు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ రాణిసత్యనారాయణగౌడ్,ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేశ్ యా దవ్, నాయకులు ఆంజనేయులు, కృష్ణ, హరీశ్, వినోద్ పాల్గొన్నారు.
మండలంలో 19 గ్రామ కవిటీ ఎన్నికలు పూర్తి
చిలిపిచెడ్,సెప్టెంబర్ 12: మండలంలో 19 గ్రామ పంచాయతీల టీఆర్ఎస్ గ్రామ కమిటీల అధ్యక్ష, ఉపాధ్యక్ష కమిటీలు పూర్తి చేసినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. చిలిపిచెడ్ గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు సుభాశ్, అజ్జమర్రి గ్రామ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గాదె యాదయ్య, ఫైజాబాద్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎంసీ విఠల్, చండూర్ గ్రామ అధ్యక్షు డు విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు అనంతం, చిట్కుల్ గ్రామ అధ్యక్షుడిగా నారాగౌడ్ , ఉపాధ్యక్షుడు మల్లేశం, బండపోతుగల్ గ్రామ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఉపాధ్యక్షుడు విఠల్, గంగారం గ్రామ అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్ల య్య, జగ్గంపేట గ్రామ అధ్యక్షుడు నర్సింహాగౌడ్, ఉపాధ్యక్షు డు అంబదాస్, గౌతాపూర్ గ్రామ అధ్యక్షుడు మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకయ్య, సోమక్కపేట గ్రామఅధ్యక్షుడు రాజుయాదవ్, ఉపాధ్యక్షుడు ఊశయ్య, రాందాస్‌గూడ గ్రామ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పోచయ్య, అంతారం గ్రామఅధ్యక్షుడు మణిప్రకాశ్గౌడ్, ఉపాధ్యక్షుడు నారాయ ణ, శీలాంపల్లి గ్రామఅధ్యక్షుడు మాధవరెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రరెడ్డి, సోమ్లా తండాగ్రామ అధ్యక్షుడు అంజనాయక్, ఉపాధ్యక్షుడు నర్సింగ్, రహీంగూడ తండా గ్రామ అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు శంకర్, బద్రియ తండా గ్రామ అధ్యక్షుడు దుర్గానాయక్, ఉపాధ్యక్షుడు శంకర్‌నాయక్, గూజిరి తండా గ్రామ అధ్యక్షుడు టోప్యినాయక్, ఉపాధ్యక్షుడు బాధ్యనాయక్, గణ్య తండా గ్రామ అధ్యక్షుడు దేవిసింగ్, ఉపాధ్యక్షుడు గన్యా, టోప్యి తండా గ్రామ అధ్యక్షుడు బిల్యానాయక్, ఉపాధ్యక్షుడు రాందాస్నాయక్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా యూత్ మాజీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు