
చిలిపిచెడ్,అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం పీపీ వినోదదుర్గారెడ్డి, మండల ప్రత్యేక అధికారి దేవయ్య, తహసీల్దార్ సహదేవ్, సర్పంచుల ఫోరం మం డల అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఎంపీడీవో శశిప్రభ,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీ పాల్గొన్నారు.
కౌడిపల్లి మండలంలో…
కౌడిపల్లి,అక్టోబర్ 7: మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని మహిళలకు బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవిత అంబర్‌సింగ్, సర్పంచుల ఫోరం మం డల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామాగౌడ్, ఎంపీటీసీ మంజుల శివాంజనేయులు, తహసీల్దార్ రాణాప్రతాప్, ఎంపీడీవో భారతి, మండల ప్రత్యేక అధికారి జయరాజ్ పాల్గొన్నారు.
వెంకటాపూర్లోజడ్పీ చైర్ పర్సన్ ..
మనోహరాబాద్, అక్టోబర్ 7: దసరా పండుగను పురస్కరించుకొని బతుకమ్మ చీరెలను మహిళల కోసం సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం వెంకటాపూర్‌లో బతుకమ్మ చీరెలను అందజేశారు. అనంతరం వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పురం మహేశ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ రేణుక ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఆంజనేయులు, నాయకులు రవి పాల్గొన్నారు.
కొల్చారంలో..
కొల్చారం, అక్టోబర్ 7: మండల పరిధిలోని వరిగుంతంలో బతుకమ్మ చీరెలను జడ్పీటీసీ మేఘమాల పం పిణీ చేశారు. చిన్నఘనపూర్‌లో మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, సర్పంచ్ ఇందిరాప్రియదర్శిని, తుక్కాపూర్‌లో సర్పంచ్ మాధవి, పైతరలో సర్పంచ్ సంతోష మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
చేగుంటలో..
చేగుంట, అక్టోబర్7: చేగుంటతో పాటు పలు గ్రామా ల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. చేగుంటలోని చెట్లతిమ్మాయిపల్లి, కర్నాల్‌పల్లి, ఇబ్రహీంపూర్తో పాటు మండలంలోని పలు గ్రామాలకు బతుకమ్మ చీరెలను సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో పంపిణీ చే శారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జగదీశ్, ఎంపీటీసీ హోళియ , వార్డు సభ్యులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, ఆక్టోబర్ 7: మాసాయిపేట మండల పరిధిలోని బొమ్మారంలో సర్పంచ్ శంకర్, స్టేషన్ మాసాయిపేటలో సర్పంచ్ నర్సింహులు, ఎంపీటీసీ నవనీతశ్రీను, మాసాయిపేటలో సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, వెల్దుర్తిలో సర్పంచ్ భాగ్యమ్మ, అందుగులపల్లిలో సర్పంచ్ వినోదతో పాటు ఆయా గ్రామా ల్లో వీవోఏలు, రేషన్ డీలర్లు, కార్యదర్శులు బతుకమ్మ చీరెలను మహిళలకు పంపిణీ చేశారు.