
కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
మెదక్/ సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 6 : కరోనా తీవ్రతను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్‌ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్ర త్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, జడ్పీ సీఈవోలు, డీఆర్డీవో, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, వ్యాక్సిన్ పంపిణీ, కరోనా టెస్ట్‌లు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, మండల స్థాయి అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
రోజు వారీ కరోనా పరీక్షలను పెంచాలని, పాజిటివ్ కేసులు, కాంటాక్ట్ కేసులను గుర్తించాలన్నారు. బాధితులను హోం ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు. హోం ట్రీట్మెంట్ కిట్స్‌ను పంపిణీ చేయాలని సూచించారు. ముందు జాగ్రత్తగా కరోనా కేర్ సెంటర్లను అన్ని వసతులతో సిద్ధం చేసుకోవాలన్నారు. టెస్ట్, ట్రెస్, ట్రీట్మెంట్ పద్ధతిని అవలంభించాలని సూచించారు. జీవో 68, 69 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ప్రజలు మాస్కులు విధిగా ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో ఆక్సిజన్, బెడ్స్, ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని మెదక్ కలెక్టర్ హరీశ్ ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తెలిపారు. లక్ష్యం మేరకు వ్యాక్సిన్ ఇస్తున్నామని, 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ అవగాహన కల్పిస్తున్నామని, లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అందుబాటులో 14 వెంటిలేటర్స్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వీడియో కాన్సరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో 440 ఆక్సిజన్ బెడ్స్, 20 ఐసీయూ బెడ్స్, 14 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని సీఎస్‌కు కలెక్టర్ వివరించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో 160, పటాన్చెరు ఏరియా దవాఖాన, నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్‌లలో 70 చొప్పున ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ఐసోలేషన్ సెంటర్లలో 154 ఆక్సిజన్ బెడ్స్, 36 ఐసీయూ బెడ్స్, 25 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జి ల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఎంహెచ్‌వో గాయత్రీదేవి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీడీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్ మోహన్, డాక్టర్ శశాంక్, డాక్టర్ రాజేశ్వరీ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
దీదీ.. ముస్లిం ఓట్లను కోల్పోయింది: ప్రధాని మోదీ
ధోనీ హెలికాప్టర్ షాట్ చాక్లెట్లు వచ్చేశాయ్!