రామచంద్రాపురం, సెస్టెంబర్ 5 : కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. జీహెచ్ఎంసీ సర్కిల్-22 పరిధిలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి బల్దియా, వైద్య సిబ్బంది సంయుక్తంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసేందుకు ప్రస్తుతం డోర్ టూ డోర్ డ్రైవ్ చేపడుతున్నారు. 12 రోజులపాటు బల్దియా, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వేస్తారు. జీహెచ్ఎంసీ సర్కిల్-22లోని భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్ల్లో ఇప్పటికే 25 శాతం వ్యాక్సిన్‌ను పూర్తిచేశారు. వ్యాక్సిన్‌ను వేసుకున్న వారి ఇంటికి గుర్తుగా అధికారులు బల్దియా స్టికర్లను అతికిస్తున్నారు. 18 ఏండ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ వేస్తున్నారు. భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్ల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుతో పాటు మొబైల్ వాహనాల ద్వారా ప్రతిరోజూ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. సర్కిల్-22కి రోజు 2,600 డోసులు వస్తున్నాయి. అందులో మొదటి, రెండో డోస్‌లను 1500 నుంచి 1800 మందికి వేస్తున్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం 13 బృందాలు పని చేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఒక నర్సు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఆశ వర్కర్లు, ముగ్గురు ఆర్పీలు, ముగ్గురు బల్దియా సిబ్బంది ఉన్నారు. వీరు ఆయా కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారి వివరాలు సేకరించి దగ్గరలో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాల వద్దకు పంపించి వ్యాక్సిన్ వేయిస్తారు. బల్దియాలో చేపట్టిన స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో ప్రతిఒక్కరికీ సులభంగా వ్యాక్సిన్ అందుతున్నది.
సర్కిల్-22లో 1,20,611 మందికి వ్యాక్సిన్..
జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సర్కిల్-22లో 1,20,611 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అందులో మొదటి డోస్‌ను 93,687 మందికి, రెండో డోస్‌ను 26,924 మందికి వేశారు. మూడు డివిజన్లకు కలిసి 13 మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశారు. మొబైల్ వాహనాల ద్వారా సర్కిల్-22లో ఇప్పటివరకు 19,073 మందికి వ్యాక్సిన్ వేశారు. భారతీనగర్, ఆర్సీపురం, పటాన్చెరు డివిజన్ల్లో 57 కాలనీలు, సుమారుగా 40,946 గృహాలు, 1.60 లక్షల జనాభా ఉంది. ఈ జనాభాకు అనుగుణంగా ప్రతిరోజూ మొదటి, రెండో డోస్‌లు అందుబాటులో ఉంచుతున్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం..
సర్కిల్22లో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తాం. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతి బృందం వారికి కేటాయించిన కాలనీలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోని వారి వివరాలు సేకరించి దగ్గరలోని మొబైల్ వాహనం వద్దకు పంపించి వ్యాక్సిన్ వేయిస్తారు. ఇప్పటివరకు మూడు డివిజన్ల్లో 1,20,611 మందికి వ్యాక్సిన్ వేశాం. 25 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. పకడ్బందీగా వ్యాక్సిన్‌నేషన్ డ్రైవ్ కొనసాగుతున్నది. రోజుకు సుమారుగా 1800 మంది వరకు వ్యాక్సిన్ వేస్తున్నాం. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
బల్దియాలో డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సర్కిల్-22లో 1,20,611 మందికి వ్యాక్సినేషన్