టేకులపల్లి : సమాజానికి సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన వారికి ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ( Viswabrahmana Sangham ) రాష్ట్ర నాయకులు బచ్చల పద్మాచారి అన్నారు. పదవీ విరమణ పొందిన చిలకమర్రి రామకృష్ణ, బొడ్డుపల్లి బ్రహ్మచారి దంపతులను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శనివారం టేకులపల్లి బ్రహ్మంగారి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.
ఇటీవల చిలకమర్రి రామకృష్ణ పోస్టల్ శాఖలో, బొడ్డుపల్లి బ్రహ్మచారి ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా వారిని శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు బచ్చల పద్మాచారి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణులంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిగ్గుట్ల వెంకటాచారి, పాల్వంచ టౌన్ అధ్యక్షులు తాళ్లూరి సత్యనారాయణ, టేకులపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.