
పుల్కల్ రూరల్, సెప్టెంబర్ 30 : సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలోని ధనేగావ్ ప్రాజెక్టు నుంచి అధికారులు రెండు రోజుల నుంచి నీటిని దిగువకు వదులుతుండగా, గురువారం ఉదయం 10:05 గంటలకు 1,35,000 వేల క్యూసెక్కుల నీరు సింగూరు ప్రాజెక్టులోకి చేరింది. దీంతో ప్రాజెక్టు 6గేట్లు ఎత్తి 75,113 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలామని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తు న్నారు. గురువారం ప్రాజెక్టులో 26.844 టీఎంసీ ల నీరు నిల్వ ఉండగా, ఇన్ ఫ్లో 72,440 క్యూసె క్కులు కొనసాగుతుండగా, జెన్కో ద్వారా 2,08 3 క్యూసెక్కులు, కెనాల్స్ 140 క్యూసెక్కులు, హెచ్ఎం డబ్ల్యూఎస్ 80 క్యూసెక్కులు, ఎంబి 70 క్యూసెక్కులు, ఈవీపీ లాస్ 300 క్యూసెక్కులు, మొత్తంగా 75,113 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏడుపాయలలో పెరుగుతున్న వరద ఉధృతి..
పాపన్నపేట, సెప్టెంబర్ 30 : ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం తొమ్మిది రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న విష యం తెలిసిందే. గురువారం సైతం వివిధ ప్రాం తాల నుంచి ఏడుపాయలకు వచ్చిన భక్తులు రాజగోపురంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. గురువా రం ఉదయం ‘సింగూరు’ నుంచి 75 వేల క్యూసె క్కుల నీటిని వదలడంతో ఏడుపాయలకు మరిం త వరద ఉధృతి పెరగనున్నట్లు నీటి పారుదలశాఖ డీఈ శివనాగరాజు వెల్లడించారు.