
సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఏప్రిల్ 4 : జడ్చర్ల మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని విద్యానగర్‌కాలనీ, తాలూకా క్లబ్, బ్లాక్ ఆఫీస్, సరస్వతీనగర్, రాజీవ్‌నగర్ కాలనీల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీల్లో సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరగా, సానుకూలంగా స్పందించారు. అన్ని కాలనీల్లో సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతుండడంతో రోడ్లు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతు చేయాల ని తెలిపారు. మున్సిపాలిటీలోని ప్రతి కాలనీలో సీసీరోడ్లతోపాటు, మురుగుకాల్వల నిర్మాణం చేపడుతామన్నా రు. ప్రజ లు తమ ఇంటివద్ద ఇంకుడుగుంత నిర్మించుకొని పారిశు ధ్యం లోపించకుండా చూడాలని కోరారు. కాలనీల్లో ఏమైనా సమస్యలు ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జడ్చర్లను అన్నివిధాలా అభివృద్ధి చేసి ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణాలు, గ్రామాల సుందరీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
మున్సిపాలిటీలోని విద్యానగర్‌కాలనీకి చెందిన ఖలీల్ శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. ఆదివారం ఖలీల్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ వరల్డ్ మె డికల్ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు.కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ సునీత, ఏఈ సాయికిరణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి, మాజీ సర్పంచ్ రేణుక, లక్ష్మీనర్సింహారావు, జీనురాల సత్యం, నాగిరెడ్డి, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, శ్రీకాంత్, బృందం గోపాల్, ఇమ్మూ, రవిశంకర్, రమేశ్, శ్రీకాంత్‌రెడ్డి, దా మోదర్, తోటారెడ్డి, అశోక్‌రెడ్డి, సతీశ్, లత, మెడికల్ షాపు యజమాని రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు.