Ayyappa Swamy Maha Padi Pooja | డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆధ్వర్యంలో మహాపడిపూజ

సికింద్రాబాద్ : మోండా డివిజన్లోని టకార్ బస్తీలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుటుంబం అధ్వర్యంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది.
టీఆర్ఎస్ యువనాయకుడు పద్మారావుగౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్, స్వరూప దంపతులతో పాటు నేతలు కిషోర్ కుమార్ గౌడ్, కిరణ్ కుమార్, త్రినేత్ర గౌడ్లతో సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఈ మహాపడి పూజలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులతో పాటు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు దీపిక, సునిత, కంది శైలజ, సామల హేమలతో సహా సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్, ఖైరతాబాద్, మల్కాజ్ గిరి, అంబర్ పేట్తో సహా తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పలువురి గురు స్వాముల అధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమం అందరిలో ఆధ్యాత్మికతను కలిగించింది. పూజకు హాజరయిన వారందరికి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కుమారులు తీర్ధ ప్రసాదాలను అందించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

