మహబూబ్నగర్అర్బన్/పాలమూరు, నవంబర్ 12 : రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనపై నిరసన వెల్లువెత్తింది. జిల్లావ్యాప్తంగా ‘మోదీ గోబ్యాక్’ నినాదం మార్మోగింది. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేయడం, నిత్యావసర ధరలను పెంచి పేదలపై పెనుభారం మోపడంపై శనివారం టీఆర్ఎస్, విద్యార్థి విభా గం, వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. పాలమూరు యూనివర్సిటీ ఎదుట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
తె లంగాణపై వివక్ష చూపుతున్న ప్రధాని మోదీ కి ఇక్కడ పర్యటించే నైతికహక్కు లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ప్రధానకార్యదర్శి వినోద్, శివకుమా ర్, టీఆర్ఎస్వీ నాయకుడు నాని, ఎస్ఎఫ్టీయూ ఇన్చార్జి ఆంజనేయులు పా ల్గొన్నా రు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో వామపక్ష నాయకులు నల్లజెండాలు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశా రు. ప్రధాని మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమం లో కురుమూర్తి, నర్సింహులు, రాములు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, నవంబర్ 12 : రాష్ట్రంలో రామగుండం ఎరువుల కార్మాగారం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రావడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, కేవిపీఎస్, ప్రజా సంఘాల నాయకులు శనివా రం జడ్చర్లలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్లజెండాలు, ప్లకార్డులు చేతబట్టి నరేంద్రమోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతిస్తున్న నరేంద్రమోదీకి తెలంగాణలో పర్యటించే నైతికహక్కు లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జి ల్లా అధ్యక్షుడు నవీన్చంద్రారెడ్డి, బాలు ము దిరాజ్, ఫైజ్, వినయ్, సోహేల్, ప్రసాద్, శ్రీకాంత్, మహ్మద్, జయరాజ్, సాయినా థ్, చెన్నయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ప రశురాం, సీఐటీయూ జిల్లా కోశాధికారి వా సియాబేగం, జగన్, నాగరాజు, కురుమూ ర్తి, మన్సూర్, బుచ్చయ్య, సాయిలు, శ్రీను, రాములు, శ్రీశైలం పాల్గొన్నారు.
దేవరకద్ర, నవంబర్ 12 : విభజన హా మీలను అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్రం లో పర్యటించే అర్హతలేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వేణుగోపాల్ అన్నారు. ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ మండలకేంద్రంలోని ప్రధానరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మేకిన్ ఇండియా పేరుతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం.. కొత్త ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాజు, వెం కటేశ్, ఆంజనేయులు, ఊశన్న ఉన్నారు.
రాజాపూర్, నవంబర్ 12 : రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ మండలకేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం, జీఎస్టీ పేరుతో పేదలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.