వనపర్తి టౌన్, ఏప్రిల్ 20 : ప్రియుడిపై మోజు తో వివాహిత తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చే యించిన ఘటన చోటు చేసుకున్నది. జనవరిలో ఘటన జరగగా.. వెలుగులోకి ఆలస్యంగా వచ్చిందని సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వివరాలు ఇ లా ఉన్నాయి.. వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన బాలస్వామి(39)కి.. కాశీంనగర్‌కు చెందిన లావణ్యతో పదేండ్ల కిందట వివాహం జరిగింది. బాలస్వామి మేస్త్రీ పనులు చేస్తూ వనపర్తి గాంధీనగర్‌లో ఉంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే మదనాపురానికి చెందిన నవీన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ అదే కాలనీలో స్నేహితులతో కలిసి ఉండేవాడు. ఈ క్రమం లో లావణ్యతో నవీన్‌కు పరిచయం ఏర్పడి.. తర్వాత వి వాహేతర సంబంధానికి దారితీసింది.
బాలస్వామి ఐదేండ్ల కిందట తనకున్న పొలాన్ని విక్రయించగా.. రూ.20 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులు చూసి న లావణ్య ప్రియుడితో సంతోషంగా గడపాలని కలలు గ న్నది. భర్తను అడ్డు తొలగించుకుంటేనే సాధ్యమని భా వించి హత్యకు కుట్ర చేసింది. ఇందులో భాగంగా లావ ణ్య కోడిపుంజుల నాటకం ఆడింది. తనకు మరింత మంచి జరగాలంటే గోపాల్పేట రోడ్డులో ఉన్న జెర్రిపోతుల మై సమ్మ వద్ద అర్ధరాత్రి కోడిపుంజులను బలి ఇవ్వాలని భర్త ను నమ్మబలికింది. దీనికి సరే అన్న బాలస్వామి జనవరి 20న అర్ధరాత్రి తన బైక్‌పై ఒక్కడే కోడిపుంజులను తీసుకొని జెర్రిపోతుల మైసమ్మ దగ్గరికి వెళ్లాడు. అప్పటికే మాటు వేసిన నవీన్ సుపారీ గ్యాంగ్ కురుమూర్తి, బంగారయ్య, గణేశ్ అక్కడ బాలస్వామిని కిడ్నాప్ చేశారు.
బలవంతంగా కా రులోకి ఎక్కించి నోట్లో గుడ్డలు నొక్కి కొత్తకోట మీదుగా హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి అక్కడున్న శ్మశాన వాటికలో పూడ్చివేశారు. అర్ధరాత్రి బయటకు వెళ్లిన తన తమ్ముడు ఇంటికి తిరిగి రాకపోవడం.. మరదలు లా వణ్య ఇంట్లో కనిపించకపోవడంతో అనుమానంతో బాలస్వామి అన్న కొమ్మ రాజు జనవరి 21న పోలీసులకు ఫి ర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫోన్నంబర్ల ఆధారంగా లావణ్య, నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. అ సలు విషయం వెలుగులోకి వచ్చింది. పాన్‌గల్‌కు చెందిన కురుమూర్తి, బంగారయ్య, గణేశ్ అతడిని హత్య చేశారు. సుపారీ మాట్లాడడంతో ముందుగా రూ.60 వేల అడ్వాన్స్‌గా అందించినట్లు.. మిగితాది తర్వాత ఇస్తామని మా ట్లాడుకున్నారు. బాలాపూర్‌కు నిందితులను తీసుకెళ్లి మృ తదేహం వెలికితీసి పోస్టుమార్టం చేశారు. హత్యకు పాల్పడిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.