నారాయణపేట, ఏప్రిల్ 13 : రైతును రాజు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుల పక్షపతిగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి అన్నారు. వరిధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం ప్రకటించడంతో బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్, జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ జొన్న ల సుభాష్, సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్, సుదర్శన్‌రెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకట్రాములు పాల్గొన్నారు.
మరికల్, ఏప్రిల్ 13 : రాష్ట్రంలో రైతులు పండించిన వడ్ల ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యకపోయిన రైతులు నష్టపోకూడదని సీఎం కేసీఆర్ రైతుల నుంచి ప్రతి గింజను మద్దతుధర ఇచ్చి కొనుగోలు చేస్తామని ప్రకటించారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి పేర్కొన్నారు. రైతుల కోసం సీఎం చేసిన ప్రకటనలో బుధవారం తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చిత్రపటాలకు రైతు లు, టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రవికుమార్, గ్రామ సర్పంచ్ కస్పే గోవర్ధన్, మండల కోఆప్షన్ సభ్యులు మతీన్, మార్కెట్ కమిటీ సభ్యులు జగదీశ్, నాయకులు చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, అశోక్, రాజేశ్, నర్సింహారెడ్డి, తిమ్మయ్యగౌడ్, విష్ణుకాంత్ రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చెసినా రైతుల సం క్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి వడ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దీంతో బుధవారం ధన్వాడ మండల కేంద్రంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సునీల్ రెడ్డి, గండి బాల్‌రాజ్, ఎంపీటీసీ కడుపయ్య, పట్టణ అధ్యక్షుడు బాల్‌రాజ్, వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాసులు, వెంకటయ్య, నరేందర్ గౌడ్, కుర్మన్న, రాము, మల్లేశ్, తిరుపతయ్య, సత్తయ్య పాల్గొన్నారు.
కోస్గి, ఏప్రిల్13 : సీఎం కేసీఆర్ రైతులు పండించిన వరిదాన్యాన్ని కేంద్రం కొనకున్నా తాము కొంటామని ప్రకటించడం హర్షణీయం అని రైతులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక శివాజీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు, టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వరప్రసాద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు.
దామరగిద, ఏప్రిల్ 13 : యాసంగిలో రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. దామరగిద్దలో ఎంపీపీ బక్క నర్సప్ప ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అశోక్‌గౌడ్, మాజీ ఉపసర్పం చ్ శెట్టిశ్రీనివాస్, నాయకులు నీలి మాణిక్యప్ప, ఫొటో రవి, రాఘవేందర్గౌడ్తోపాటు రైతులు పాల్గొన్నారు.
మద్దూరు, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ చిత్రపటానికి మండ ల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు బుధవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సీ వెంకటయ్య, నాయకులు సలీం, వెంకటయ్యగౌడ్, శివకుమార్, మహేందర్ పాల్గొన్నారు.
మాగనూర్ ఏప్రిల్ 13 : రైతులను కాపాడుకోవడంలో తె లంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. బుధవారం నేరడగంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకటయ్య మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ రైతులను నిలువునా మోసం చే స్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.