మూసాపేట, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించినా రాష్ట్ర సర్కారు రైతులకు అండగా నిలువడంపై బుధవా రం సంబురాలు నిర్వహించారు. గ్రామగ్రామానా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. అడ్డాకుల మండలకేంద్రంలోని పంటపొలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా పెద్దమునగల్‌చేడ్, కందూరు రైతువేదికల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించగా, బలీదుపల్లిలో ధాన్యాభిషేకం చేశారు. మూసాపేట మండల ఆదర్శ మహిళా సెంటర్, జానంపేట, చక్రాపూర్, వేముల, నందిపేట తదితర గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్డ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలకు చెంది న టీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
భూత్పూర్, ఏప్రిల్ 13 : మండలంలోని తాటిపర్తి, తాటికొండ, కొత్తమొల్గర, మద్దిగట్ల గ్రామాలతోపాటు భూత్పూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మ న్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ మాట్లాడుతూ యాసంగిలో పండించిన ప్రతి గింజనూ కొంటామని ము ఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నా రు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటయ్య, కౌన్సిలర్ రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు మురళీధర్‌గౌడ్, గడ్డం రాములు, మాధవరెడ్డి, బోరింగ్ నర్సింహులు, శేఖర్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సురేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 13 : యాసంగి వడ్ల ను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై రైతులు సంబురాలు నిర్వహించారు. మం డలంలోని గుడిబడలో రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే చిన్నచింతకుంట మం డలం పర్దీపూర్‌లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోటరాము ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మండల నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కోయిలకొండ, ఏప్రిల్ 13 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. యా సంగి వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మండలకేంద్రం లో సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ మల్లయ్య, సర్పంచ్ నారాయణరెడ్డి, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, ఎంపీటీసీ ఆంజనేయులు, భీంరెడ్డి, అంకిళ్ల రవి, యాయబ్ఖాన్, మాధవులు, నారాయణగౌడ్, లక్కీగౌడ్, నజీమ్, మొగులయ్య, భీమయ్య, శ్రీనివాసులు, సంజు, వెంకట్‌నాయక్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని ఎంపీపీ సుధాశ్రీ, వైస్‌ఎంపీపీ అనిత బుధవారం ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా నిరంకుశంగా వ్యవహరించగా, సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా రైతుల తరఫున సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
బాలానగర్, ఏప్రిల్ 13 : రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని జెడ్పీటీసీ కల్యాణీలక్ష్మణ్నాయక్ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధం గా రైతుల కోసం పథకాలను అమలు చేయడంతోపాటు.. యాసంగిలో వడ్లు పండించిన రైతు గోస పడకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయడం హర్షణీయమన్నారు.