నవాబ్‌పేట, ఏప్రిల్ 22 : మిషన్ కాకతీ య కింద ప్రభుత్వం చెరువులు, కుంటలను బలోపేతం చేస్తుంటే.. కొంతమంది రియల్ వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి కుంటల ను ధ్వంసం చేస్తున్నారు. భూములుగా మా ర్చి విక్రయిస్తూ లక్షలు గడించుకుంటున్నా రు. మండలంలో ఇరిగేషన్ అధికారుల అం చనా ప్రకారం 266 కుంటలు, చెరువులు ఉ న్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద సు మారుగా 135 చెరువులు, కుంటలను పునరుద్ధరించింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భజలాలు పెరిగాయి. రైతులు సంబురంగా సాగు చేసుకుంటున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్, ఔటర్‌రింగ్ రోడ్డు వంటి వాటితో భూముల ధరలు అమాంతం పెరిగాయి.
ఇదే అదునుగా భావించిన అక్కమార్కులు స్థానికంగా చోటామోటా నాయకులతో కుమ్మక్కై కుంటలకు ఎసరు పెడుతున్నారు. రాత్రికి రాత్రే కుంటలను మాయం చేస్తూ వ్యవసాయ భూమిగా మారుస్తున్నా రు. నాలుగేండ్లలో సుమారుగా ఆరేడు కుం టలు మాయమయ్యాయి. ఇప్పటూర్ శివా రు పరిధిలోని బొల్లమోని కుంటను రెండేం డ్ల కిందట ధ్వంసం చేశారు. కూచూర్ పరిధిలోని దోశోనికుంటను ఏడాది కిందట పక్కన ఉన్న పట్టాదారులే ధ్వంసం చేసి ఆనవాళ్లు లే కుండా చేశారు.
కారుకొండ శివారులోని కొ త్తకుంటను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ధ్వంసం చేసి తన భూమిలో కలుపుకొన్నా డు. యన్మన్గండ్ల శివారులోని శంకర్‌రాజ కుంటను పక్కన ఉన్న భూ యజమాని రి యల్టర్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దేపల్లి శివారులో ఆరేండ్ల కిందట ఓ కుంటను రియల్టర్లు ధ్వంసం చేశారు.
కుంట లు ధ్వంసం కావడంతో ఆయకట్టు రైతు లు నష్టపోతున్నారు. ఇంత జరుగుతు న్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారు లు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఏ డాది కిందట మేజర్, మై నర్ ఇరిగేషన్ విభాగాలను కలిపి నీటిపారుదల శాఖలో విలీనం చేశారు. నవాబ్పేటను ఇరిగేషన్ సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఈఈలు, నలుగురు ఏఈఈలను నియమించారు.
సబ్ డివిజన్ ఏర్పాటు చేసి ఏడాది గడుస్తు న్నా నవాబ్‌పేటలో కార్యాలయం ఏర్పాటు చేయలేదు. అసలు ఇరిగేషన్ అధికారులు ప ని చేస్తున్నారో.. లేదో కూడా ఎవరికీ తెలియ ని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ధ్వంసమవుతున్న కుం టలను కాపాడాలని ప్రజలు, రైతులు, స్థాని కులు కోరుతున్నారు.
తాసిల్దార్ రాజేందర్‌రెడ్డిని వివరణ కోర గా.. ‘యన్మన్గండ్ల శివారులోని కుంటను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేశాం. ధ్వంసం చేసిన స్థానంలో యథావిధిగా కుంట కట్టను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశాం. ఇతర గ్రామాల్లో ధ్వంసమైన కుంట కట్టలను కూడా పరిశీలిస్తాం. రైతుల వారి సొంత పట్టాపొలంలో ఉన్న కుంటలను ధ్వంసం చేయడానికి వీలులేదు. వాటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.
డీఈఈ సురేశ్‌ను వివరణ కోరగా.. ‘ఏడాది కిందట సబ్‌డివిజన్‌గా ఏర్పడింది. ఏఈలు, డీఈఈలు ఉండాలి. కానీ పెద్దగా పనిలేకపోవడంతో ఇతర పనులకు వినియోగిస్తున్నాం. అవసరమైనప్పుడు పనులు చేపడుతున్నాం. కుంటలను ధ్వంసం చేసినట్లు తమ దృష్టికి వచ్చింది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.