అచ్చంపేట, ఏ ప్రిల్ 22 : సమాజంలో హిజ్రాలు నిరాదరణకు గురవుతున్నా రు. ట్రాన్స్జెండర్లు లక్షణాలు కనిపిస్తే చాలు ఇంటినుంచి వెలివేస్తున్నారు. బతికుండగానే పేగు బంధాలను తెం చుకుంటున్నారు. సృష్టిలో ఆడ, మగ రెండు జాతులను సృష్టించాడు. అయితే ఈ తెగలనే కాకుండా మూడో తెగను కూడా సృష్టించాడు. తల్లికి కాన్పు అయిన వెం టనే ఆడ, మగబిడ్డన అని అడుగుతుంటారు. ఎక్స్, వై క్రోమోజోమ్‌లు కలిస్తే అబ్బాయిలు పుడుతారని, ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయిలు పుడుతారని సైన్సుపరంగా తెలు సు. ఆడ, మగ నమూనాల్లో ఇమడలేక ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు తమ శరీరాలు, మనుస్సు, కుటుంబాలతోనూ సమాజంలో ని త్యం కుస్తీపడుతూ ట్రాన్స్జెండర్లు తమ జీవితాలను దేవుడిపై భారం వేసి నెట్టుకొస్తున్నారు. ట్రాన్స్జెండర్ల లక్షణాలు కలిగిన కొంతమంది పురుషులు ఆడవారి మాదిరిగా ప్రవర్తిస్తు హేళనకు గురవుతుంటారు.
మరికొందరు ఈ లక్షణాలతో ఇళ్లనుంచి వెళ్లిపోతుంటారు. తన శరీరం లో ఏం జరుగుతుందో తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతూ ఆత్మహత్య లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. హిజ్రాలు పురాణ కాలం నుంచి ఉన్నారు. మన కండ్ల ముందు ఉన్నవాళ్లు లక్షణాలతో హిజ్రాలుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ని త్యం వాళ్లను చీదరించుకుంటున్నారు. నిత్యం వాళ్లు అనేక వివక్ష, అవమానం ఎదుర్కొంటున్నారు. సమాజంలో అడుగడుగునా హింసాయుత జీవితం గడుపుతున్నారు. అనేక హా ర్మోన్లు, క్రోమోజోన్ల కారణంగా పుట్టిన ట్రాన్స్జెండర్లు తోటి మనుషులుగానే భావించాల్సి ఉండగా అడుగడుగునా అవమానిస్తూ, అవహేళన చేస్తూ, సమాజానికి దూరంగా చూస్తూ మా నసిక క్షోభను గురిచేస్తుండడంపై ట్రాన్స్జెండర్లు తమ బాధలను సమాజానికి తెలియజేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్జెండర్లను చీ దరింపులకు, భయానికి, వెలివేతకు, వివక్షకు గురువుతున్న హిజ్రాలపై సమాజం ఇంత క్రూ రంగా ఎందుకు వ్యవహరిస్తున్నదని, సమాజం లో తాము కూడా మనుషులమే కాదా? తల్లి క డుపులో అందరిలాగే తాము కూడా మగపిల్లడి గా పుట్టాము. హార్మోన్ల వల్ల క్రమంగా ఆడపిల్ల లక్షణాలు రావడం మేము చేసిన తప్పా? అం టూ ప్రశ్నిస్తున్నారు. కనీసం తోటి మనుషులుగా గుర్తింపులేక అనేక అవమానాలు భరిస్తూ బతకాలా? చనిపోవాలా?.. నిత్యం బాధలను దిగమింగుకొని జీవిస్తున్నామని, తమ జీవితగాధలను ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. అచ్చంపేట ప్రాంతంలో దాదాపు 300 మంది ఉన్నారని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్య లో ఉంటారని హిజ్రాలు పేర్కొన్నారు.
సమాజంలో ఏగతాళి చేస్తున్నారు. మేము కూడా మనుషులమే.. దయచేసి మమ్ములను మీలో ఒకరిగా గుర్తించండి. ఒకరు హిజ్రా, మరొకరు చెక్క అంటారు. ఇలా వేరు వేరు పేర్లతో పిలుస్తారు. సమాజంలో ఆడ, మగ ఉన్నట్లుగానే హిజ్రా అనుకోవచ్చు కాదా. ఎందుకు మమ్ములను చీదరించుకుంటారు. నోటి మాటలతో మమ్ములను చంపేస్తున్నారు. రాత్రి, పగలు ఏడ్చుకుంటూ బాధపడుతుంటాము. బతకలేక తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేసి బతుకుతున్నాం. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలన్న ఏం అనుకుంటారోనని బతుకీడుస్తున్నాము. మేము బతకడమే కష్టంగా మారింది. హిజ్రాలు అని చిన్నచూపు చూడకండి. భిక్షాటన తప్ప వేరే మార్గం లేదు. అమ్మనాన్న దృష్టిలో చనిపోయినట్లు భావిస్తున్నారు. కుటుంబంలోకి పిలవరు. మీరు వస్తే మాకు విలువుండదని మా కన్న వాళ్లే అంటుంటారు.
– సుకన్య, హిజ్రా హార్మోన్ల సమస్యే.. వాళ్ల తప్పు కాదు
హార్మోన్ల కారణంగా ఆడ, మగ లక్షణాలతో పుడుతారు. క్రోమోజోమ్‌ల కారణంగా లోపల మగ, బయట ఆడ లక్షణాలు వస్తాయి. దీంతో ఒక జెండర్‌లో ఉండాల్సిన వాళ్లు ఇంకో జెండర్‌గా వ్యవహరిస్తారు. శరీరంలోనే ఆడ, మగ లక్షణాలు కలిసివస్తాయి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. కుటీర పరిశ్రమలాంటివి పెట్టి వాళ్లు తయారు చేసిన వస్తువులు ప్రభుత్వమే కొనుగోలు చేసేవిధంగా చూడాలి. సమాజంలో వాళ్లపై జరుగుతున్న అరాచకాలు, హింస, అవమానించడంపై కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వం వారి గురించి ఆలోచించాలి. ప్రత్యేకంగా ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సమాజంలో ఇలాంటి జీవితాలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది.
– డాక్టర్ ప్రవీణ, ఆర్ఎంవో, నీలోఫర్ దవాఖాన, హైదరాబాద్
నా పేరు యాదగిరి హిజ్రాగా మారిన తర్వాత మల్లికగా పేరు మార్చుకున్నాను. ఇంటర్ వరకు చదువుకున్నాను. 8వ తరగతి చదువుతున్నప్పుడు లక్షణాలు కనిపించాయి. నా మాదిరిగా ఉన్న ఓ వ్యక్తి బస్సులో పరిచయమయ్యా డు. అక్కడి నుంచి హిజ్రా కమ్యూనిటీలో కలిసిపోయాను. మా కుటుంబంలో గురు వు, అమ్మ, అక్క, అత్త, కోడలు, కూతురు, చెల్లెలు, మనుమరాలు ఉంటారు. శ్రీ మంతలు, పుట్టినరోజు వేడుకల్లో కలుస్తాము. అమ్మాయిలుగా సర్జరీ జరిగిన 40రోజుల తర్వాత అమ్మవారి పూజ చేస్తాము. అప్పుడు అందరం కలుస్తాము. సర్జరీ ముంబయి, కడప, వైజాగ్, విజయవాడలో చేస్తారు. రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చు గురువు, అమ్మ పెట్టుకుంటారు. ఎవరికి ఆపద వచ్చినా కలిసి పంచుకుంటాము. మాకూ సమాజంలో గౌరవంగా బతకాలని ఉంటది. దేవుడిచ్చిన వరంగా భావిస్తాం. మా బతుకు మేమే బతుకుతున్నాము.
– మల్లిక, హిజ్రా, అచ్చంపేట
నా పేరు విజయ్ హిజ్రాగా మారిన తర్వాత మాధవిగా పేరు మార్చుకున్నాను. నేను హిజ్రాగా కావడానికి కార ణం పన్నెండేళ్ల వయసులో హర్మోన్లు బయటపడ్డాయి. అ ప్పటినుంచి అమ్మాయి మాదిరిగా ప్రవర్తించాను. లక్షణా లు తెలిసిన తర్వాత కుటుంబసభ్యులు, అన్న, వదిన, అ మ్మ అందరూ నన్ను దూరం పెట్టారు. నేను మున్సిపల్లో పనిచేసేవాడిని. నాకు ఎందుకు ఈ లక్షణాలు వచ్చాయో తెలియక నిత్యం బాధపడుతుండేదాన్ని. ఊర్లో తిరుగుతుం టే ఎగతాళి చేసేవారు. దీంతో ఇంటినుంచి బయటకు వచ్చేశాను. నేను ఇష్టపడే హిజ్రా కమ్యూనిటీలో చేరాను. మా బాధలను అడిగిన వాళ్లే లేరు. నమస్తే తెలంగాణ పలకరించడం సంతోషంగా ఉన్నది. మా బాధలు పది మందికి తెలియజేయండి. అప్పుడైనా సమాజం మారి మమ్ములను బాధపెట్టకుండా ఉంటది.
– మాధవి, హిజ్రా
మాలో చాలామంది ఉన్నత చదువులు చదువుకున్నవాళ్లు ఉన్నారు. ఓ ముస్లిం అబ్బాయి మెడిసిన్ చదువుతుండగా ఎగతాళి భరించలేక బయటకు వచ్చి మాతో కలిసిపోయాడు. డిగ్రీ, పీజీ ఇతర ఉన్నత చదవులు చదివిన వాళ్లు ఉన్నారు. హార్మోన్ల సమస్య వల్ల హిజ్రాగా మారాల్సి వచ్చింది. మాకు ఉపాధి అవకాశాలు ఇవ్వరు. అందరిలా గౌరవంగా ఏదైనా ఉద్యోగం చేసి బతుకుదామని అనుకుంటాము. కానీ మమ్మల్ని చూస్తేనే దూరం పెడుతున్నారు. కొందరు మా బాధలను అర్థం చేసుకొని చేతనైన సాయం చేస్తారు. ఏదైనా దుకాణం పెట్టుకుందామన్న కొనడానికి ఎవరూ రారు. ఇంట్లో అంట్లు కడిగే పనులు కూడా ఇవ్వరు. ప్రభుత్వం ఆదుకోవాలి. ఆధార్, రేషన్‌కార్డు ఇవ్వాలి. కొందరికి , ఇంకా చాలా మందికి రావాలి. ఇల్లు, పింఛన్ ఇవ్వాలి.
– భూమి, హిజ్రాల గురువు