మూసాపేట, ఏప్రిల్ 22 : తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వం నడుస్తున్నదని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చక్రాపూర్, వేముల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యా సంగిలో వరి వేయవద్దని ప్రభుత్వం ఎంతచెప్పినా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరి వేయండి మేం కొనిపిస్తామని ప్రగల్భాలు పలికి వరిపంట చేతికి వచ్చాక చేతులు ఎత్తేయడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రంలోని ధా న్యాన్ని కొనేందుకు రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టనప్పుడు రాష్ట్రంలోని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం ఎందుకని ఆయన విమర్శించారు.
బండి సంజయ్ పాదయాత్ర సోయి ఉండి చేస్తున్నాడా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బండి సంజయ్‌కి నిజంగానే సోయి ఉంటే పక్కనే ఉన్న రాయిచూర్‌కు పోయి అక్కడి రైతులను తెలంగాణ రాష్ట్రంలోని రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 24గంటల కరెంట్ ఉందా అడగమనండి అన్నారు. రాయిచూర్ రైతులు తెలంగాణ రాష్ట్రంలోని పథకాలను కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయాలని అడుగుతున్నారన్నారు. పండించిన పంటను కొనడం కేంద్రం బాధ్యత, కేంద్ర ప్రభుత్వం బాధ్యతను మరిచి రైతులను మోసం చేయడం సరికాదని ఆయ న విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ కళావతి, ఏడీఏ యశ్వంత్‌రావు, తాసిల్దార్ మంజుల, ఏవో రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మం డల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, సర్పంచు శైజల పలువురు నాయకులు పాల్గొన్నారు.
కొత్తకోట, ఏప్రిల్ 22 : మండల కేంద్రం సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం దళితబంధు ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను లబ్ధిదారుడు మంద ప్రశాంత్‌కు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, వైస్‌ఎంపీపీ వడ్డ్డె్డ శ్రీనివాసులు, ఐటీ ఐ చైర్మన్ గంగాధర్‌శెట్టి, సింగిల్ విండో చైర్మన్ వాసుదేవారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.