రాజాపూర్/ నవాబ్‌పేట, ఏప్రిల్ 22 : డబ్బు ఏండ్లుగా దేశానికి పట్టిన శని కాం గ్రెస్ పార్టీ అని, ఆ పార్టీని దేశంలో కనుమరుగు చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగం గా ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం దొండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి ఆధ్వర్యంలో సింగమగూడ స ర్పంచ్ చాందీతోపాటు 60మంది కాంగ్రె స్ నాయకులు లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అలాగే రా యపల్లికి చెందిన 50మంది దళితులు టీఆర్ఎస్ యూత్వింగ్ ఉపాధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చే రారు. లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులను, గిరిజనులను, ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూసిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే దళితులు, గిరిజనులు, ముస్లింల అభివృద్ధ్దికి పెద్దపీట వే స్తున్నదని వివరించారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మ హిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, నాయకులు నరహరి, అనంద్‌గౌడ్, సత్యయ్య, యా దగిరి, విజయ్, నర్సింహులుగౌడ్, గం గాధర్గౌడ్, నర్సింహానాయక్, వెంకట్‌నాయక్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నవాబ్‌పేటకు చెందిన ప లువురు కాంగ్రెస్ నాయకులు శుక్రవా రం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే డాక్టర్ లక్షారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో బడికెల మల్లేశ్, బంక శ్రీశైలం, కారుకొండ న ర్సింహులు, మంత నర్సింహులు, మల్లే శ్, బీ మల్లేశ్, మంత నరేశ్, బన్నీ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాడేమో ని నర్సింహులు, నాయకులు నాగిరెడ్డి, లక్ష్మయ్య, సర్పంచ్ గోపాల్గౌడ్తోపా టు నాయకులు పాల్గొన్నారు.
జడ్చర్ల, ఏప్రిల్ 22 : రాష్ట్రంలోని పేద ప్రజలందరూ బాగుపడాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చే యడం జరుగుతుందని ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. అలాగే రంజాన్ పండుగ ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యే పేద ముస్లింలకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యా దయ్య, మున్సిపల్ చైర్మన్ దోరేపల్లి లక్ష్మి, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్ ముడా డైరెక్ట ర్లు రవిశంకర్, ఇమ్మూ, ప్రీతమ్తోపాటు నాయకులు పాల్గొన్నారు.