మూసాపేట, ఏప్రిల్ 22 : బడుగు బలహీనవర్గాల బంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సంకలమద్దిలో దళితబంధు పథకం నిధులతో చేపట్టిన డెయిరీఫాం నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు. అలాగే గ్రామానికి చెందిన రైతు పెంటయ్య ఇటీవల మృతి చెందగా, అతడి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ల క్ష్యంతో దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూప ని కళావతీకొండయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్ సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో స్వరూప తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 22 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం అప్పంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో వడ్లు పండించిన రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
అప్పంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వెంకటన్న తండ్రి బాలప్ప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం దేవరకద్ర మండలం కౌకుంట్లలో జెడ్పీటీసీ అన్నపూర్ణ అత్తమ్మ గాండ్ల భాగ్యలక్ష్మి వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పుట్టపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోపాల్ వైద్యఖర్చుల ని మిత్తం రూ.4లక్షల సీఎం సహాయనిధి ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ పీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, సర్పంచ్ సువర్ణ, ఎంపీటీసీ మనోహర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, రైతుబం ధు సమితి అధ్యక్షుడు మన్యంగౌడ్, నాయకులు శ్రీకాంత్‌యాదవ్ పాల్గొన్నారు.
భూత్పూర్, ఏప్రిల్ 22 : మూసాపేట మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీ నిధులు రూ.17లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను శుక్రవారం భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అందజేశారు. నందిపేట, జానంపేట గ్రామాల్లో వాల్మీకి భవన నిర్మాణాలకు రూ.5లక్షల చొప్పున, నిజాలాపూర్‌లో సీసీరోడ్డు నిర్మాణానికి రూ.5లక్షలు, స్పూర్తితండాలో డ్రైనే జీ నిర్మాణానికి రూ.2లక్షలు కేటాయించిన ట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇం ద్రయ్యసాగర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు లక్ష్మీనర్సింహయాదవ్ పాల్గొన్నారు.