బిచ్కుంద, ఫిబ్రవరి 9: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కోడ్ ఉల్లంఘించి గడువు ముగిసిన తర్వాత కూడా ప్రచారం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని 9వ వార్డులోని ఓ ఇంటికి రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చారు. దీంతో స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. లక్ష్మీకాంతారావు డౌన్‌డౌన్ అని నినాదాలు చేశారు. జనం భారీగా గుమిగూడటంతో పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.