పెద్దమందడి, ఏప్రిల్ 20 : అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేందుకు ప్ర తి ఒక్కరూ సహకరించాలని.., తన, మ న తారతమ్యం లేకుండా పార్టీలకతీతం గా కలిసిరావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపా రు. వెల్టూర్ గోపాలసముద్రం పనులను త్వరితగతిన పూర్తిచేసి.. వచ్చే సీజన్‌కల్లా అందుబాటులోకి తీసుకురావాలని కాం ట్రాక్టర్లకు సూచించారు. బుధవారం వె ల్టూర్ గ్రామంలో గోపాలసముద్రం పు నరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశా రు.
అలాగే గట్లఖానాపూర్లో గ్రామ పంచాయతీ భవనం, పీర్ల చావిడిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ గోపాలసముద్రం చె రువుకు రూ.8 కోట్లతో పునరుద్ధరణ ప నులు చేపడుతున్నామన్నారు. చెరువులోని ఒండ్రుమట్టిని రైతులు తమ పొలా ల్లో వేసుకొని భూములను సారవంతం గా మార్చుకోవాలన్నారు.
అలుగు వద్ద రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు మి నీ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలన్నారు. గట్లఖానాపూర్లో రూ.21 లక్షలతో జీపీ భ వనం, రూ.5 లక్షలతో పీర్లచావిడిని ని ర్మించామాన్నారు. అన్ని గ్రామాలకు సా గునీరందుతున్నదని, మిగిలిపోయిన గ ట్లఖానాపూర్ గ్రామానికి త్వరలోనే కృ ష్ణాజలాలు చేరుతాయన్నారు. అంతకుముందు గోపాలసముద్రంపై ఉన్న ఆలయంలో మంత్రి పూజలు చేశారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, అ దనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, రైతుబం ధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వే ణు, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, ఎంపీటీసీ దామోదర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ నాగేంద్రంయాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, స త్యారెడ్డి, రఘువ్ధ్దన్రెడ్డి, శివశంకర్, అధికారులు పాల్గొన్నారు.
ఎంసెట్ ప్రక్రియలో వనపర్తి కళాశాలకు చోటుదక్కింది. ఇటీవల జి ల్లా కేంద్రానికి మంజూరైన జేఎన్టీయూలో అడ్మిషన్లు పొందేందుకు జేఎన్టీయూ వనపర్తి ఆప్షన్‌ను పొందుపర్చారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో భాగంగా అ భ్యర్థులు వనపర్తి ఆప్షన్‌ను ఎంచుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి 45 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నది. దీనికి సంబంధించిన పత్రాలను బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో రిజిస్ట్రా ర్ మంజూర్ హుస్సేన్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి అందజేశారు.
ఈ విద్యా సంవత్సరంలో సీఎస్ఈ, సీఎస్ఈ(ఏఐ. ఎంఎల్), ఈసీఈ, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులకుగానూ 300 సీ ట్లు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా బీ ఫార్మసీలో 60 సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఐసీటీఈ మా ర్గదర్శకాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నా రు. కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ వైస్‌చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు.