అమ్రాబాద్, ఏప్రిల్ 20 : నల్లమల టైగర్ రి జర్వు ఫారెస్ట్ మద్దిమడుగు రేంజ్ కృష్ణానది పరీవాహక ప్రాంతమైన గీసుగండి సమీపంలో బుధవారం నాలుగు రాబంధులు అటవీశాఖాధికారుల కంట పడ్డాయని ఫారెస్ట్ డివిజనల్ అధికారి రోహిత్గోపిడి తెలిపారు. 20 ఏండ్లుగా కనిపించని రా బంధులు ఒక్కసారిగా కనిపించిన దృశ్యాలను కె మెరాల్లో బంధించారు. దేశంలో 500 రాబంధు లు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు.
నల్లమలలో ఒకే చోట నాలుగు కనిపించడం శుభసూచకమని, వీటి వల్ల పర్యావరణం, వన్యప్రాణులు, జీవవైవిధ్యం పెరిగేందుకు సంకేతమన్నారు. 20 20లో కొల్లాపూర్ ప్రాంతంలో ఒక్కటి మాత్రమే కనిపించిందని, పులులు అధికంగా ఉండే చోట ఇవి ఎక్కువగా ఉంటాయన్నారు. రాబంధులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.