
ట్రాన్స్‌కో ఏఈ చంద్రశేఖర్‌పై సభ్యులు ఆగ్రహం
ధన్వాడ, మార్చి 30 : నెలకు ఒక్కసారైనా గ్రామాలకు రావాలని… ఎక్కడి స మస్యలు అక్కడే ఉన్నాయని.. వాటిని గుర్తించాలని.. కానీ మీరు ఒక్కసారి కూ డా గ్రామాలకు రావడం లేదని, గ్రామా ల్లో కరెంట్ సమస్యలు అలాగానే ఉండిపోతున్నాయని సర్పంచులు, ఎంపీటీసీ లు ట్రాన్స్‌కో ఏఈ చంద్రశేఖర్‌ను నిలదీశారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వైస్ ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో రామకిష్టాయపల్లి సర్పంచ్ మాధవరెడ్డి, బుడ్డమర్రితండా సర్పంచ్ పూర్యానాయక్, హన్మన్పల్లి సర్పంచ్ గోవింద్‌నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో కరెంట్ సమస్యలు చాలా ఉన్నాయని, సమస్యలు తీర్చడం లేదంటూ ట్రాన్స్ కో ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాల్లో వైకుంఠధామా ల వద్ద స్తంభం ఏర్పాటు చేయాలని ఎన్నో నెలల నుంచి కోరుతున్న చేయడం లేదని బుడ్డమర్రితం డా సర్పంచ్ పూర్యానాయక్ సభలో ఆందోళన వ్య క్తం చేశారు. ఫోన్లు చేస్తే కూడా జవాబు ఇవ్వడ ం లేదంటూ జెడ్పీటీసీ విమల సైతం ఆరోపించా రు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వాలని ఎంపీటీసీలు ఉమేశ్కుమార్గుప్తా, గోవర్ధన్‌గౌడ్ సమావేశంలో కోరా రు. సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీవో యశోదమ్మ, తాసిల్దార్ బాల్‌చందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటకమ ల, ఏపీవో సిద్ధేశ్వర్, వైద్యాధికారి వెంకట్దాసు, వ్యవసాయాధికారి ప్రదీప్కూమార్, ఇరిగేషన్ ఏ ఈ మంగారెడ్డితో పాటుగా పలువురు తదితరులు పాల్గొన్నారు.