e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జిల్లాలు వ్యవసాయ రంగం బలోపేతం

వ్యవసాయ రంగం బలోపేతం

  • కరెంట్‌ సమస్యలు లేకుండా సబ్‌స్టేషన్ల నిర్మాణం
  • రెండు, మూడు గ్రామాలకు కలిపి సబ్‌స్టేషన్‌
  • మరో 40 ఏండ్ల వరకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
  • కోతలు లేని కరెంట్‌ సరఫరాకు ప్రాధాన్యం
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

గోపాల్‌పేట, సెప్టెంబర్‌ 22 : వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని ఏదుట్ల గ్రామంలో రూ.కోటీ 53 లక్షలతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పనులకు శంకుస్థాపన, అలాగే చాకల్‌పల్లిలో రూ.కోటీ 80 లక్షలతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ అవసరాలను దృష్టి లో పెట్టుకొని 3, 4 గ్రామాలకు కలిసి ఒక విద్యత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరెంటు సమస్య లు లేకుండా ఉండేందుకే సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఏదుట్ల సబ్‌స్టేషన్‌ పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. బండరావిపాకుల, కొంకలపల్లి, నాగపూర్‌, గౌరిదేవిపల్లి గ్రామాలకు సంబంధించి కూడలి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు త్వ భూమి చూసి నెల, రెండు నెలల్లో సబ్‌స్టేషన్‌ ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. రాబోవు 30, 40 ఏండ్ల వరకు విద్యుత్‌ సమస్యలు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు సజావుగా కొనసాగించామని చెప్పారు. కొవిడ్‌ విపత్తు కారణంగా దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో క్రమంగా వృద్ధి రేటు పెరుగుతున్నదని చెప్పారు. రూ.21 వేల కోట్లు రైతుబంధు సా యం రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గోపాల్‌పేట నుంచి వయా రేవల్లి మీదుగా నాగర్‌కర్నూల్‌ వరకు డ బుల్‌ రోడ్డు కోసం రూ.50 కోట్లు మంజూరు చేయించామని, కానీ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, కాంట్రాక్టర్‌ను

పిలిచి మాట్లాడుతామన్నారు. కేఎల్‌ఐ కాలువకు మరమ్మతులు కొనసాగుతున్నాయని, చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామన్నారు. ఇందుకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. గ్రామీణ రహదారులన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నామని చెప్పారు. చాకల్‌పల్లి సబ్‌స్టేషన్‌కు భూమి ఇచ్చిన దాత రాకాసి రాంరెడ్డికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఐదారు రో జుల్లో రూ.50 వేల రుణమాఫీ పూర్తి అవుతుందన్నారు. నాలుగు విడుతల్లో రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ అవుతాయన్నారు. అనంతరం స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఎస్‌ఈ నరేంద్ర కుమార్‌, డీఈ నా గేంద్రకుమార్‌, ఏఈఈ యాదయ్య, ఏఈలు నర్సింహ, పీ నర్సింహ, ఎంపీడీవో కరుణశ్రీ, డిప్యూటీ తాసిల్దార్‌ షేక్‌ జాకీర్‌, ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి, వైస్‌ ఎం పీపీ చంద్రశేఖర్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ హర్యానాయ క్‌, విండో చైర్మన్‌ రఘు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ గువ్వల రాములు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్‌రాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతి యా దవ్‌, సర్పంచులు నాగమణి, వసంత, శ్రీనివాసులు, శేఖర్‌యాదవ్‌, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, రేణుక, టీఆర్‌ఎస్‌ నాయకులు నీలాంబర్‌రావు, మనేశ్‌బాబు, వెంకటేశ్‌, కొత్తరామారావు, సత్యశీలారెడ్డి, కోదండం, కోటీశ్వర్‌రె డ్డి, శేషిరెడ్డి, క్రాంతిరావు, శివకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -

చివరి ఆయకట్టుకూ సాగునీరు

రేవల్లి, సెప్టెంబర్‌ 22 : ఎంజీకేఎల్‌ఐ ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తల్పునూరు గ్రామంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పాత తండా సమీపంలో అసంపూర్తిగా ఉన్న కాల్వ పనులను పరిశీలించారు. సమీప రైతులతో కొద్దిసేపు మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలిన పనులను యాసంగి పూర్తయిన వెంటనే చేయిస్తామని చెప్పారు. సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. కొత్త పింఛన్లు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బంకల సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎంపీటీసీలు కుర్మతిరెడ్డి, శ్రీశైలం యాదవ్‌, సర్పంచులు లక్ష్మి, జ్యోతి శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ సభ్యుడు సురేశ్‌, నాయకులు సత్యశీలారెడ్డి, కోటిరెడ్డి, దొడ్ల రాములు, అర్జున్‌రావు, సురేందర్‌రెడ్డి,బంకల రవి, రహీం, నసీర్‌, రాములు, రంగుల నర్సింహ పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement